స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Indian  Idol: అందమైన గాత్రమే కాదు.. అంతకు మించిన అందం ఆమె సొంతం. సింగర్‏గా పాటలు పాడడమే కాకుండా.. నటన కూడా

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Neha Kakkar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2021 | 1:01 PM

Indian  Idol: అందమైన గాత్రమే కాదు.. అంతకు మించిన అందం ఆమె సొంతం. సింగర్‏గా పాటలు పాడడమే కాకుండా.. నటన కూడా ఒకింత అలవర్చుకున్న బ్యూటీ నేహకక్కర్. ఈమె తన ప్రియుడు రోహన్ ప్రీత్ సింగ్‌ను గత నెల అక్టోబర్ 24న వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేహ కక్కర్ ప్రముఖ సింగింగ్ రియాల్టీ షోలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 11లో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఇందులో ఆమెతోపాటు ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దద్లానీలు జడ్జస్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో హోస్ట్ ఆదిత్యా నారాయణ్ తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది నేహా. అదే సమయంలో అదిత్యా నేహ చేతిని పట్టుకోని డ్యాన్స్ చేసాడు. ఒక్కసారిగా అతని చేతి నుంచి జారి స్టేజీపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో … ఓ సింగర్ పర్ఫామెన్స్ అయ్యాక.. నేహా కక్కర్ యాంకర్ ఆదిత్యాతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఇక నేహాను ఆదిత్యా అనుసరిస్తూ.. డ్యాన్స్ చేస్తూ ఉండగా.. జడ్జిలుగా ఉన్నఅను మాలిక్, విశాల్ దద్లానీలు కామన్ అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా డ్యాన్స్ చేస్తున్న నేహ.. అదిత్యా చేతి పట్టును కోల్పోయి కిందపడిపోతుంది. దీంతో ఒక్కసార అలర్డ్ అయిన ఆదిత్యా ఆమెను పూర్తిగా కింద పడిపోకుండా పట్టుకుంటారు. ఇందుకు సంధించిన వీడియోను సోనీ టీవీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

ట్వీట్..

Also Read: Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..

రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడిన మాస్ మాహరాజా మూవీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే..

మరో పాన్ ఇండియా డైరెక్టర్‏తో ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్… ఆ స్పెషల్ రోజునే అనౌన్స్ చేయనున్న మేకర్స్ ?

Jagapathi Babu: కరోనాకు థ్యాంక్స్ చెబుతున్న జగపతి బాబు.. కారణమెంటో తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..