Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..
కీర్తి సురేష్.. మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది.
Updated on: Apr 19, 2021 | 11:26 AM

చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో కీర్తిసురేష్ వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్ సేవలు దీర్ఘకాలం కొనసాగాలని సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన వివరించింది.

జోస్ ఆలుక్కాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమి తులుకావడం గర్వకారణమని కీర్తి పేర్కొంది.

ఇటీవల నితిన్ సరసన రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి.. ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.

కీర్తి సురేష్..





























