Jagapathi Babu: కరోనాకు థ్యాంక్స్ చెబుతున్న జగపతి బాబు.. కారణమెంటో తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. కుటుంబ కథ చిత్రాలతో

Jagapathi Babu: కరోనాకు థ్యాంక్స్ చెబుతున్న జగపతి బాబు.. కారణమెంటో తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Jagapati Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2021 | 7:48 AM

జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. కుటుంబ కథ చిత్రాలతో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు.. ఇప్పుడు వరుస సినిమాలతో పుల్ బిజీగా మారిపోయారు. కేవలం హీరోగానే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల విలన్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు జగ్గభాయ్.. అటూ సినిమాల్లోనే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలో జగపతి బాబు ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే.. పలు సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు. తాజాగా జగ్గు భాయ్ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అయింది. అందుకు కారణం యావత్ ప్రపంచాన్ని ప్రాణ భయంతో వణికిస్తున్న కరోనా వైరస్‏కు థ్యాంక్స్ చెప్పడమే.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో కోవిడ్ నియంత్రణ చర్యలు చెపట్టాయి ప్రభుత్వాలు. ఇక ఈ మాహమ్మారి సినీ పరిశ్రమను ఏమాత్రం వదలడం లేదు. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ మహమ్మారి భారిన పడడంతో కొన్ని సినిమా షూటింగ్స్ తాత్కలికంగా మూసివేస్తున్నారు. సినిమా షూటింగ్‌లలో పాల్గొనే వాళ్లు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కువ శాతం ఎవ్వరిని దగ్గరకు రానివ్వకుండా తమ పనులు తామే చేసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ షూటింగ్‌లు ముగించుకుంటున్నారు. ఇక జగపతి బాబు కూడా తన పనులు తానే చేసుకుంటున్నాడు. మేకప్ మ్యాన్ అవసరం లేకుండా తనకు తానే మేకప్ చేసుకోవడం నేర్చుకున్నాను అని జగపతిబాబు తాజా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది కరోనా కారణంగానే జరిగింది కాబట్టి.. దానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌‌మీడియాలో వైరల్ అయింది.

ట్వీట్..

ప్రస్తుతం జగపతి బాబు.. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే కాకుండా.. పుష్ప, రిపబ్లిక్, మహాసముద్రం, లక్ష్య వంటి సినిమాల్లోనూ నటిస్తున్నారు.

Aslo Read: jagapathi babu: కరోనాకు థాంక్స్ చెప్పిన జగ్గు భాయ్.. ఫన్నీ ట్వీట్ చేసిన జగపతిబాబు..

నాని అసలు తగ్గట్లేదుగా.. శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్… ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా…