నాని అసలు తగ్గట్లేదుగా.. శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్… ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా…

నాని అసలు తగ్గట్లేదుగా.. శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్... ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా...
Shyam Singharoy

నేచురల్ స్టార్ నానికి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అష్టాచెమ్మ నుంచి నిన్నటి వి సినిమా వరకు

Rajitha Chanti

|

Apr 19, 2021 | 6:49 AM

నేచురల్ స్టార్ నానికి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అష్టాచెమ్మ నుంచి నిన్నటి వి సినిమా వరకు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ…. ప్రేక్షకులకు చేరువయ్యాడు నాని. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎప్పుడూ ఎంటర్ టైన్మెంట్ పాత్రల్లో నటించిన నాని ఇటీవల వీ సినిమాలో నెగిటివ్ పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని పండిచాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసున్న నాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అయితే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో హైదరాబాద్‌లోనే కోల్‌కతా సెట్ నిర్మించనున్నారట. దాదాపు పది ఎకరాల విస్త్రీర్ణంలో రూ.6.5 కోట్ల బారీ బడ్జెట్‏తో ఈ సెట్‏ను రూపొందించబోతున్నారట.    శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

Rashmika mandanna: పుష్ప సినిమాలో రష్మిక పాత్రను సుకుమార్ అలా డిజైన్ చేసారా..!

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో కరోనా కలకలం.. చిత్రకారణకు చిన్న బ్రేక్

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu