రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడిన మాస్ మాహరాజా మూవీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే..

రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడిన మాస్ మాహరాజా మూవీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే..
Raviteja

Raviteja:  యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనా మహామ్మారి రోజూ రోజూకి తన మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్

Rajitha Chanti

|

Apr 19, 2021 | 9:05 AM

Raviteja:  యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనా మహామ్మారి రోజూ రోజూకి తన మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కేంద్రంతోపాటు.. రాష్ట్రా ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాయి. అటు ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ పనులు జోరుగా జరుగుతున్నా.. కరోనా కట్టడి మాత్రం జరగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు స్వయం లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇక ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సినీ పరిశ్రమపై మరోసారి పంజా విసురుతుంది. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా భారిన పడగా.. పలు సినిమాల షూటింగ్స్ వాయిదా పడిపోతున్నాయి.

ఇప్పటికే కరోనా ప్రభావంతో టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మాస్ మాహరాజా రవితేజ కూడా చేరాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక అదే జోష్‏తో రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత శరత్ మండవ అనే కొత్త దర్శకుకడితో కలిసి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలి షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ప్రస్తుత కరోనా వేవ్ ఉద్ధృతి తగ్గాకే, చిత్రీకరణ ప్రారంభించాలని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి భావిస్తున్నారని సమాచారం.

Also Read: మరో పాన్ ఇండియా డైరెక్టర్‏తో ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్… ఆ స్పెషల్ రోజునే అనౌన్స్ చేయనున్న మేకర్స్ ?

నాని అసలు తగ్గట్లేదుగా.. శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్… ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా…

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu