Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

Megastar Chiranjeevi: ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు.

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2021 | 3:18 PM

Megastar Chiranjeevi: ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పుడు చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం మలయాళంలో సూపర్ హిట్‌ విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‏లో నటించబోతున్నారు చిరు. ఈ చిత్రానికి జయం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభమయ్యింది.

తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది. ఈ సినిమాలో చిరంజీవికి ధీటైన ప్రతినాయకుడి పాత్ర కోసం దర్శకుడు అనురాగ్ కశ్యప్‏ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తనకు చిరంజీవితో నటించాలని కోరిక ఉన్నా.. తాను సినిమాలతో బిజీగా ఉండడం వలన నటించేలకపోతున్నానని సున్నితంగా తిరస్కరించారట అనురాగ్ కశ్యప్. దీంతో మరోకరిని వెతికే పనిలో పడిందట చిత్రయూనిట్. లూసీఫర్ సినిమాను ఈ సంవత్సరం వీలైనంత త్వరగా పూర్తిచేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కొణిదెల ప్రొడక్షన్స్ తో కలసి ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..