నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..
Arjun Kapoor

Arjun Kapoor : ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న వీడియో వైరల్ గా మారిపోతుంది. ఇక పొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయే

Rajitha Chanti

|

Apr 17, 2021 | 10:31 PM

Arjun Kapoor : ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న వీడియో వైరల్ గా మారిపోతుంది. ఇక పొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు అందరూ అందులోనే మునిగి పోతున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాను తెగ వాడెస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. ఇక కొంత మంది నెటిజన్లు సెలబ్రెటీల పోస్టులకు సాఫ్ట్ గా కామెంట్స్ పెడుతున్నా.. మరికొందరు మాత్రం తప్పుగా చేస్తుంటారు. ఇక ఫీమేల్ సెలబ్రెటీల విషయానికి వస్తే.. కొంత మంది నెటిజన్ల కామెంట్స్ మరీ అరాచకం. కేవలం మహిళలకే కాకుండా.. హీరోలకు సైతం పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ.. అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.

Arjun Kapoor 1

ఎస్‌ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అయాంన్ష్ అనే కుర్రాడు కోలుకోవాలంటే.. చికిత్సకు దాదాపు రూ.16 కోట్లు అవసరం పడతాయి. దీంతో అతని తల్లిదండ్రులు విరాళాల కోసం ఓ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వాళ్లు డబ్బు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఆ బాలుడికి తగిన సహాయం అందించాలని తన ఫాలోవర్లను కోరాడు. ఇది చూసిన ఓ నెటిజన్ కాస్త భిన్నంగా కామెంట్ చేసాడు. ‘నీ ఒక్క రోజు జీతంతో అతని వెంటనే నువ్వు కాపాడగలవు’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అర్జున్ అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ‘నేను ఒకవేళ ఒకరోజు రూ.16 కోట్లు సంపాదిస్తే.. ఈ పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది తెలిసే నేను నాకు తోచిన సహాయాన్ని ఇప్పటికే చేశాను. అతనికి మరింత సహాయం అందాలనే ఈ పోస్ట్ చేశాను’ అంటూ అర్జున్ సదరు కామెంట్‌కి రిప్లే ఇచ్చాడు.

Also Read: అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. న్యూ ప్రాజెక్ట్‏ను ప్రారంభించిన విశ్వక్ సేన్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu