Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..

తమిళ స్టార్ హీరో విక్రమ్, సదా హీరోహీరోయిన్లుగా.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా అపరిచితుడు.. అప్పట్లో

Aparichithudu : హిందీ 'అపరిచితుడి'కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..
Kiara Advani
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 5:02 PM

తమిళ స్టార్ హీరో విక్రమ్, సదా హీరోహీరోయిన్లుగా.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా అపరిచితుడు.. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత ఈ సినిమాలో హిందీలో రీమేక్ చేయబోతున్నట్లుగా శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా అనౌన్స్ చేసిన మరుసటి రోజు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే లీగల్ నోటిసులను కూడా అందుకున్నాడు శంకర్.. కానీ హిందీలో అపరిచితుడు రీమేక్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇందులో విక్రమ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‏వీర్ సింగ్ నటిస్తుండగా.. హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు చిత్రయూనిట్.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్‏వీర్ కు జోడీగా కియారా అద్వానీ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ కియారాను సంప్రదించిగా.. కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదిలా ఉంటే.. శంకర్.. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరగ్గా.. ఆ చిత్రాన్ని తాత్కలికంగా నిలపివేశారు. కానీ శంకర్ మాత్రం అసలు ఖాళీగా ఉండకుండా తన పని తాను కనిచ్చుకుంటున్నాడు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా రూపొందిచబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో రష్మిక జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Also Read: Vijay Antony: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘విజయ రాఘవన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?