Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..

Actor Vivekసినీ పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను తన కామెడీతో నవ్వించి...

Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్... ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..
Vivek
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 2:49 PM

Actor Vivekసినీ పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను తన కామెడీతో నవ్వించి… మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వివేక్. ఆయన అకాల మరణం మొత్తం సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 500 పైగా సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తీవ్ర గుండెపోటుకు గురైన వివేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూయడంతో.. చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వివేక్ సన్నిహితులు, మహానటి ఫేం కీర్తి సురేష్‌తోపాటు పలువురు ప్రముఖులు ఆయన మృతదేహానికి నివాలర్పించారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ట్విటర్‌ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియ‌జేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాప‌కాలను గుర్తు చేసుకున్నారు.

కేవలం నటనపైనే ఇష్టం కాకుండా.. వివేక్ సామాజ సేవకుడు. అలాగే ప్రకృతి ప్రేమికుడు కూడా. వివేక్ నటనకు పద్మ శ్రీ పురస్కారం కూడా వరించింది. చాలా సార్లు తన గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని పలు సందర్భాల్లో చెబుతు ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఇప్పుడు ఈ విషయాన్ని వివేక్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. తన చిరకాల కోరిక తీరకుండానే వివేక్ కన్నుమూయడంతో అభిమానులు కంటతడి పెడుతున్నారు. కానీ వివేక్ కోరికను తాము ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నారు.

ట్వీట్…

Also Read: Saina Movie: అమెజాన్‌ ప్రైమ్‌లోకి ‘సైనా’.. అఫీషియల్ ట్వీట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Actor Vivek: నటుడు వివేక్ హఠాన్మరణంపై అనుమానాలు? తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు

‘జాతిరత్నాలు’ టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..