‘జాతిరత్నాలు’ టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..

'జాతిరత్నాలు' టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..
Jathi Rathnalu Dinesh Karth

Jathi Rathnalu Movie: నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన ప్రాత్రల్లో కేవీ అనుదీప్ తెరకెక్కించిన సినిమా 'జాతి రత్నాలు'.

Rajitha Chanti

|

Apr 16, 2021 | 8:42 PM

Jathi Rathnalu Movie: నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన ప్రాత్రల్లో కేవీ అనుదీప్ తెరకెక్కించిన సినిమా ‘జాతి రత్నాలు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.  ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాపీసు దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం నుంచి ఈ సినిమా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ చూశాడు. ఇంకే ముందు తన స్టైల్లో జాతిరత్నాలు టీంపై ప్రశంసలు కురిపించాడు.

జాతి రత్నాలు.. పూర్తిగా ఓ నవ్వుల ప్రయాణమే.. చూసిన ప్రతి సీన్ నవ్వులు తెప్పించింది. డైలాగులు, డైరెక్షన్‏తోపాటు ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారు. ఇలాంటి జానర్‌లో ఓ సినిమాను చేయడం చాలా కష్టం కానీ మీరు చాలా సునాయాసంగా చేశారు. అదరగొట్టారు. మీరు ఇంతే శక్తితో కొనసాగాలి’ అంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ‘ఏంటి? నీకు తెలుగొచ్చా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమాను ఆదరించడం బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..

చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu