సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..

Krithy Shetty : మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ చాలా అరుదు. ఇక ఒక్క అవకాశం వచ్చాక.. మరోసారి

  • Rajitha Chanti
  • Publish Date - 3:16 pm, Fri, 16 April 21
సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..
Krithi Shetty

Krithy Shetty : మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ చాలా అరుదు. ఇక ఒక్క అవకాశం వచ్చాక.. మరోసారి ఛాన్స్ వస్తుందా రాదా అనేది చెప్పడం కష్టం. ఇక కొంతమందికి… ప్రతిభా.. అందం ఉన్నా.. మరో ఛాన్స్ రావడానికి చాలా సమయమే పడుతుంది. కానీ మొదటి సినిమా విడుదలకు ముందే వరుస ఆఫర్లను కొట్టేసింది కృతి శెట్టి. అందుకే సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడిని లక్కీ గర్ల్ అంటుంటారు. కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత కృతి.. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు నటిసతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తదుపరి సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా కృతికి తమిళ చిత్రపరిశ్రమలోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. తమిళ స్టార్ హీరో ధనుష్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టెసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ధనుష్ హీరోగా.. మారి, మారి 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్ మరోసారి ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో ధనుష్ సరసన కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. తమిళ పరిశ్రమలోకి స్టార్ హీరో సినిమాతో బేబమ్మ ఇవ్వబోతున్నట్లే మరీ..

Also Read: చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..

అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..

‘ఈశ్వరా.. పరమేశ్వరా’ నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..