AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A. R. Rahman: మ‌నిషి బాధ‌ల‌కు విరుగుడు సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`.

A. R. Rahman: మ‌నిషి బాధ‌ల‌కు విరుగుడు సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్
Ar Rehaman
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2021 | 3:17 PM

Share

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు. విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో నేడు ( ఏప్రిల్ 16న) విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంగా ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ ‘99 సాంగ్స్‌’ సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ కాన్‌స్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘99 సాంగ్స్‌’ సినిమా సంగీతానికి సంబంధించి ప్రాభ‌వాన్ని వివ‌రించే డిజిట‌ల్ షో ఇది. ‘99 సాంగ్స్‌’ సినిమా సంగీతానికి ఈ మ్యూజిక్ కాన్‌స‌ర్ట్ ఇది వ‌ర‌కు చూడ‌ని అద్భుత‌మైన అనుభ‌వాన్ని అందించింది. ఇప్పుడు ఈ డిజిట‌ల్ కాన్‌స‌ర్ట్ జియో సావ‌న్‌లో టెలికాస్ట్ అయ్యింది.

ఈ సినిమా విడుద‌ల‌కు ముందే శ్రోత‌ల‌కు ఈ మ్యూజిక్ కాన్‌సర్ట్ అద్భుత‌మైన ఓ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. ఈ సినిమాలో హీరోగా న‌టించిన ఇహాన్ భ‌ట్ ‘99 సాంగ్స్‌’ సినిమా కోసం ఏడాది పాటు పియానోను ప్ర‌త్యేకంగా నేర్చుకున్నారు. సంగీతంపై అవ‌గాహ‌న ఉన్న విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌కుడిగా.. ఎ.ఆర్‌.రెహమాన్‌తో జ‌త చేర‌డం విశేషం. అంద‌రూ క‌లిసి చేసిన ‘99 సాంగ్స్‌’ డిజిట‌ల్ మ్యూజిక‌ల్ మాంటేజ్‌ను అందించారు. ఈ సంగీత స్ఫూర్తిని, సినిమా క‌థ‌కు ఈ మ్యూజిక‌ల్ మాంటేజ్ ఓ గౌర‌వాన్ని తీసుకొచ్చింది.

ఈ ‘99 సాంగ్స్’ స్పెషల్ కచేరీలో గ్లోబల్ మ్యూజిక్ లెజెండ్, గాయకులు బెన్నీ దయాల్, శష్వత్ సింగ్, షాషా తిరుపతి, విజయ్ యేసుదాస్, శ్రీకాంత్ హరిహరన్, పూర్వి కౌతీష్, హరిచరన్, సన్షైన్ ఆర్కెస్ట్రా సమ్మిళతమై ఉన్నారు. ఈ మ్యూజిక్ కాన్‌స్ట‌ర్ అనేది సంగీతం యొక్క శ‌క్తి, సెలబ్రేష‌న్స్ గురించి తెలియ‌జేసేది. మూవీ మేకింగ్‌లో సంగీత ప‌రంగానే కాకుండా క‌థా ర‌చ‌యిత‌గా కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ భాగ‌మైయ్యారు. ఈ సందర్బంగా ఎ.ఆర్‌.రెహమాన్ మాట్లాడుతూ ‘‘నిజానికి ‘99 సాంగ్స్‌’లోని పాటలను నేను ప్రతి నగరం, కాలేజీకి ప్రదర్శనగా చేయాలని అనుకున్నాను. కానీ ప్రస్తుత సమయంలో గొప్ప గాయకులు, సంగీత దర్శకులు ఇందులో భాగమైన ఈ సినిమా మ్యూజిక్ షోను అందించ‌డానికి నిర్ణ‌యించుకున్నాం. ప్రేక్ష‌కులు ఏప్రిల్ 16న మాస్క్‌ల‌తో సినిమాకెళ్లి సినిమాపై మీకున్న ప్రేమ‌ను చూపిస్తార‌ని భావిస్తున్నాం. ‘99 సాంగ్స్’ అనేది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్య ఒక మనిషి పోరాటం గురించి తెలియ‌జేసే కథ. మ‌నిషి బాధ‌ల‌కు విరుగుడు సంగీతం అనే చెప్పేలా ఈ క‌థ ఉంటుంది.అని అన్నారు.

Movie Actress: నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి.. సంచలనంగా మారిన వివాదం..

Actor Vivek: ప్రముఖ నటుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక.. ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..

ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?