Actor Vivek: ప్రముఖ నటుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక.. ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..

Actor Vivek: ప్రముఖ నటుడు వివేక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దాంతో..

Actor Vivek: ప్రముఖ నటుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక.. ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..
Actor Vivek
Follow us

|

Updated on: Apr 16, 2021 | 1:16 PM

Actor Vivek: ప్రముఖ నటుడు వివేక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను చెన్నైలోని వడపళని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వివేక్‌ను పరిశీలించిన వైద్యులు.. కార్డియాక్ అరెస్ట్‌‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు సిమ్స్ వైద్యులు తెలిపారు. అలాగే వివేక్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న అభిమానులు.. తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయనకు ఏమీ కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

ఇదిలాఉంటే.. 59 ఏళ్ల వివేక్ గురువారం నాడు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. అనంతరం క్షేమంగా బయటకు వచ్చిన వివేక్.. కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ‘కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం. టీకా వేసుకోవడం’ ముఖ్యం అని ప్రకటించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని అన్నారు. ‘వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకదా? అని మీరు నన్ను అడుగొచ్చు. అయితే, టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకే కరోనా టీకా తీసుకోండి’ అని వివేక్ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే వివేక్.. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోడాన్ని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

నటుడు వివేక్.. కోలివుడ్‌లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విడుదలైన సింగం, యముడు వంటి సినిమాల్లోనూ పోలీసు పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

Also read:

Ramadan 2021: రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేస్తున్నారా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇఫ్తార్ విందులో వీటిని చేర్చుకుంటే సరి

Jharkhand: ఆలయంలో పూజలు చేసిన ముస్లిం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు