Jharkhand: ఆలయంలో పూజలు చేసిన ముస్లిం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు
జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇర్ఫాన్ అన్సారీ పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇర్ఫాన్ అన్సారీ బాబా బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో పూజలు చేశారు.
Jharkhand: జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇర్ఫాన్ అన్సారీ పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇర్ఫాన్ అన్సారీ బాబా బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో పూజలు చేశారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిషికాంత్ దూబే ఆయనపై ఫైర్ అవుతున్నారు. “హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు” ఇర్ఫాన్ పై చర్యలు తీసుకోకపోతే తాను కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్సారీపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు పెట్టాలని, ఇది ఏడాది వరకు విచారణ లేకుండా నిర్బంధించడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. ఒకవేళ అన్సారీ కనుక నిజమైన భక్తుడు అయితే కనుక మొదట హిందూ మతాన్ని అవలంబించాలనీ.. అటువంటిదేమీ లేకుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. “బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలోని గార్వ్ గ్రిహ [గర్భగుడి] వద్ద ముస్లింలకు ప్రవేశించడానికి లేదా పూజలు చేయడానికి అనుమతి లేదు. కానీ, అక్కడ అన్సారీ పూజలు నిర్వహించారు. అదే కాబా [మక్కా] వద్ద ప్రార్థన చేయడానికి హిందువులకు అనుమతి ఉందా? మరి అక్కడ అనుమతి అలా లేనప్పుడు.. బైద్యనాథ్ ధామ్ ఆలయంలో కూడా అదే జరుగుతుంది కదా?”అని దుబే అన్నారు.
ఇది రాజకీయ సమస్య కాదని విశ్వాసానికి సంబంధించినదని దుబే అన్నారు. “అన్సారీ ఉద్దేశపూర్వకంగా కోట్ల మంది హిందువుల మతపరమైన భావాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించారు” అని ఆయన అన్నారు. “నేను ఇసిఐ [ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా] కు లేఖ రాశాను మరియు అతనిపై చర్యలు కోరుతూ ప్రధాన కార్యదర్శి అలాగే ఇతర సంబంధిత వ్యక్తిలకు ఒక కాపీని పంపాను. ఎన్నికలకు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా, అన్సారీ మతపరమైన మనోభావాలను రేకెత్తించడానికి ప్రయత్నించారు. వారు ఎటువంటి చర్య తీసుకోకపోతే, నేను న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాను. ” అని దూబే చెప్పారు.
Also Read: Ranjit Singh: సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత…కోవిడ్ కారణంగా..!
Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులుగా ఇండియాలోకి అడుగు..