Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులుగా ఇండియాలోకి అడుగు..

Mumbai Couple: ఖతార్‌లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోణపనతో ముంబైకి చెందిన దంపతులు ఒనిబా, షరిక్ ఖురేషి 2019 లో అరెస్టయ్యారు. అక్కడ న్యాయస్థానం..

  • Surya Kala
  • Publish Date - 8:10 am, Fri, 16 April 21
Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులుగా ఇండియాలోకి అడుగు..
Mumbai Couple

Mumbai Couple: ఖతార్‌లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో ముంబైకి చెందిన దంపతులు ఒనిబా, షరిక్ ఖురేషి 2019 లో అరెస్టయ్యారు. అక్కడ న్యాయస్థానం వీరిని దోషిగా తేల్చి ఈ కేసులో ఈ దంపతులకు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే ఈ దంపతుల కుటుంబాలు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఎట్టకేలకు ఒనిబా, షరిక్ ఖురేషి నిర్దోషిలుగా తేలడంతో ఈ ముంబైకి చెందిన దంపతులు గురువారం తమ కుమార్తెతో కలిసి భారత్ లో అడుగు పెట్టారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ జంట ముంబై విమానాశ్రయంలో దిగినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారి తెలిపారు.

ఈ దంపతులు ఖతార్ కు వెళ్తున్న సమయంలో వీరి బ్యాగ్ లో వారికి తెలియకుండానే కుటుంబ సభ్యుడు మాదక ద్రవ్యాలను పెట్టినట్లు తెలియడంతో..ఈ జంటపై ఉన్న ఆరోపణలను తొలగించి నిర్దోషులుగా రిలీజ్ చేశారు. 2019 లో ఖతారీ అధికారులు ఈ దంపతుల బ్యాగ్ లో ఉన్న 4.1 కిలోల మత్తు పదార్ధాలను (గంజాయిని) స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మత్తు పదార్ధాల రవాణా చేస్తున్నారంటూ.. ఈ జంటను 2019 జూలైలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అనంతరం ఈ జంట తమకు న్యాయం చేయమని భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అధికారుల విచారణలో షరిక్ ఖురేషి అత్త తబస్సం ఖురేషి మత్తు పదార్ధాలను ఈ దంపతుల బ్యాగ్ లో వారికి తెలియకుండా పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు. ఈ దంపతుల ఖతార్ యాత్రను తబస్సుం స్పాన్సర్ చేసినట్లు అధికారి తెలిపారు.

వీరు దోషులుగా తేలిన సమయంలో షరిక్ జపనీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఒనిబా గర్భవతి. ఆమె గత ఫిబ్రవరిలో జైలులో ఆయత్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. తమ విషయంలో జోక్యం చేసుకోవాలని .. తమకు న్యాయం చేయాలని కోరుతూ దంపతుల కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సిబి అధికారులు ఖతార్‌లోని అధికారులతో సంప్రదించారు. అక్కడ కోర్టుని ఆశ్రయించారు. చివరికి, ఈ జంట నిర్దోషులుగా తేలడంతో అక్కడ ప్రభుత్వం రిలీజ్ చేసింది.

Mumbai Couple1

Mumbai Couple1

Also Read: ఆధార్‌కార్డు లోని మీ ఫోటో నచ్చలేదా అసంతృప్తిగా ఉన్నారా..అయితే సింపుల్‌గా మార్చేసుకోండి ఇలా..!

హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి