Karnataka CD Case: కర్ణాటక రాసలీల కేసులో మరో మలుపు… కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు..
Karnataka CD Case: కర్ణాటక రాసలీల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో సీడీ యువతికి సహకరించిన మరో..
Karnataka CD Case: కర్ణాటక రాసలీల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో సీడీ యువతికి సహకరించిన మరో యువతిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రాసలీలల వ్యవహారం కర్నాటకలోనే కాక.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సీడీ యువతికి అండగా కొన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన మాలూరుకు చెందిన యువతిని సిట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రాలసీలలకు సంబంధించిన వీడియో బహిర్గతం అయిన తరువాత ఆ వ్యవహారంలో భాగమైన యువతి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అలా అజ్ఞాతంలోకి వెళ్లిన సదరు యువతి.. మాలూరుకు చెందిన యువతి ఆశ్రయంలో ఉన్నట్లు సిట్ అధికారులు తాజాగా గుర్తించారు. ఆ సీడీ విడుదలయ్యే కొన్ని రోజుల ముందు నుంచే సదరు యువతి మాలూరు యువతితో ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె ఆశ్రయంలో ఉన్నన్ని రోజులు మాలూరు యువతికి రోజుకు రూ. 25వేలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
కాగా, సీడీ విడుదలయ్యాక యువతి 26 రోజుల పాటు కనిపించకుండా పోయింది. అన్ని రోజులు ఎక్కడున్నారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ 26 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు యువతి పలు సీడీలను విడుదల చేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో తాజాగా మాలూరు యువతిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆమెను విచారించారు. సీడీ యువతి చెప్పిన వివరాలను, మాలూరు యువతి చెప్పిన వివరాలకు బేరీజు వేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అలాగే.. సీడీ విడుదల అయ్యాక ఆ యువతిని ఎవరెవరు కలిశారు? ఎక్కడ ఉన్నారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీయగా.. మాలూరు యువతి పూర్తి సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మాలూరు యువతి ద్వారా సీడీ లేడీ ఎక్కడ ఎక్కడ తలదాచుకుందో ఆ ప్రదేశాలన్నింటినీ అధికారులు పరిశీలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 70 మందిని విచారించిన సిట్ అధికారులు.. మాలూరు యువతిని అదుపులోకి తీసుకోవడంతో కీలక సమాచారం దొరికినట్లయ్యింది.
Also read:
Petrol, Diesel Price Today: స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు..! దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై కేసు నమోదు..! అక్రమ నీటి కనెక్షన్ వ్యవహారమే కారణమా..?