Coronavirus: కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో 2.5 లక్షల కోవిడ్‌ పరీక్షలు.. కఠినమైన నిర్ణయాలు

Coronavirus: దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. మృత్యుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ నుంచి సోకుతుందో తెలియదు గానీ.. వేల సంఖ్యలో పాజిటివ్‌...

Coronavirus: కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో 2.5 లక్షల కోవిడ్‌ పరీక్షలు.. కఠినమైన నిర్ణయాలు
Cm Pinarayi Vijayan
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Apr 16, 2021 | 7:54 AM

Coronavirus: దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. మృత్యుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ నుంచి సోకుతుందో తెలియదు గానీ.. వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్‌యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ సోకిన వ్యక్తులను గుర్తించి వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం ప్రకటించారు. దీనిలో భాగంగా కరోనాపై సమీక్షించిన ఆయన.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్‌ 16,17 తేదీల్లో రెండున్నర లక్షల వరకు కోవిడ్‌ పరీక్షలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచడమే కాకుండా కఠినమైన నియంత్రణ, టీకాల పంపిణీలో భాగంగా దీనిని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కరోనా పరీక్షకు సంబంధించి జిల్లా యంత్రాంగం లక్ష్యాలు నిర్దేశించుకుని సిద్దంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో క్రియాశీలంగా పని చేసిన ఉద్యోగులతో పాటు ప్రజా రవాణా, సేవ, వైద్య రంగాల్లోని సిబ్బందికి విధిగా కరోనా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కిరాణ దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లలోని వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మరో వైపు వివాహాలతో పాటు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని అన్నారు. కాగా, కేరళలో నిన్న ఒక్క రోజే 8,778 మంది పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 26 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ బారి నుంచి 2,642 మంది కోలుకున్నట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, దేశ వ్యా్ప్తంగా కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కొందరు మాస్క్‌లు ధరించకపోవడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదని, ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తేనే కరోనా తగ్గుముఖం పడుతుంది తప్ప ఇతర మార్గాలేమి లేవని చెబున్నారు.

ఇవీ చదవండి: AP Corona cases: ఏపీలో కట్టు తప్పుతున్న కరోనా వైరస్.. 5 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Remdesivir: రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత కరోనా రెండో వేవ్ ఎదుర్కోవడంలో ప్రభావాన్ని చూపిస్తోందా?