ఎల్‌ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! పెరగనున్న జీతాలు, అలవెన్స్‌లు.. ఈ వారంలో కేంద్రం నిర్ణయం..?

ఎల్‌ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! పెరగనున్న జీతాలు, అలవెన్స్‌లు.. ఈ వారంలో కేంద్రం నిర్ణయం..?
Lic Employees

LIC Employees : ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. జీతాలు పెంచాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఉద్యోగుల కల నెరవేరబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం

uppula Raju

|

Apr 16, 2021 | 8:11 AM

LIC Employees : ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. జీతాలు పెంచాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఉద్యోగుల కల నెరవేరబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. వేతన పెంపు విషయమై ఎల్ఐసీ నాయకత్వం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి.

ఆగస్ట్ 1, 2017 నుండి ఉద్యోగుల వేతనాలు పెంచవలసి ఉంది. కానీ వాయిదా పడింది. వేతన పెంపు నిర్ణయం వాయిదాపడటం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. వేతన పెంపు 18.5 శాతం నుండి 20 శాతం మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది వారికి సంతృప్తిని కలిగించే విషయం. ఎల్ఐసీ యాజమాన్యం గతంలో 16 శాతం వేతన పెంపును అమలు చేసింది. ఇప్పుడు వేతన పెంపు సంకేతాలు ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్తే.

ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు రానుంది. ఈ బీమా దిగ్గజం ఐపీవోకు వచ్చే సమయంలో ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నాయి. వేతన పెంపుతో పాటు ఎల్ఐసీ మేనేజ్‌మెంట్ హోమ్ లోన్ పైన 100 బేసిస్ పాయింట్ తగ్గింపును ప్రకటించింది. కొత్త వేతన సవరణలో 18.5 శాతం నుండి 20 శాతం మేర ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎల్ఐసీ FY21లో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పోరేషన్ వృద్ధి పది శాతం పెరిగిందని చైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. సమాచారం మేరకు ఎల్ఐసీ కొత్త బిజినెస్ 11 నెలల కాలంలో (ఫిబ్రవరి 2021 నాటికి) ప్రాఫిట్ రూ.1,56,068 కోట్లుగా ఉంది.

Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులకుగా ఇండియాలోకి అడుగు..

Venkatesh: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ దృశ్యం2….సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ అదేనట..

Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు… నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu