Petrol, Diesel Price Today: స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు..! దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

Petrol And Diesel Rates Today : భారత్‌లో పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. అంతకుముందు నిత్యం భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల

Petrol, Diesel Price Today: స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు..! దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
Petrol And Diesel Price
Follow us
uppula Raju

|

Updated on: Apr 16, 2021 | 7:40 AM

Petrol And Diesel Rates Today: భారత్‌లో పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. అంతకుముందు నిత్యం భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ మరోవైపు గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరుగాయి. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు యజమానులు భయపడ్డారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. ఓ వైపు ప్రజలు, మరోవైపు విపక్షపార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. శుక్రవారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62, డీజిల్‌ ధర రూ.83.61 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.87 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.93 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.52 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.05 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.95.36 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.88.92గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.03గా ఉంది.

Aadhaar Card: ఆధార్‌కార్డు లోని మీ ఫోటో నచ్చలేదా అసంతృప్తిగా ఉన్నారా..అయితే సింపుల్‌గా మార్చేసుకోండి ఇలా..!

జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై కేసు నమోదు..! అక్రమ నీటి కనెక్షన్ వ్యవహారమే కారణమా..?

Pooja Hegde: బుట్టబొమ్మకు వెల్లువెత్తుతున్న అవకాశాలు.. రెమ్యునరేషన్ పెంచినా ఆగని ఆఫర్లు..