AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ట్రావెల్‌ బిజినెస్‌లో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్… క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలుపై చర్చలు

Flipkart: వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ట్రావెల్‌ అండ్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లా్‌ట్‌ఫామ్‌ క్లియర్‌ట్రిప్‌లో కొంత వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు సంబంధించి...

Flipkart: ట్రావెల్‌ బిజినెస్‌లో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్... క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలుపై చర్చలు
Flipkart
Subhash Goud
| Edited By: Shiva Prajapati|

Updated on: Apr 16, 2021 | 9:08 AM

Share

Flipkart: వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ట్రావెల్‌ అండ్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లా్‌ట్‌ఫామ్‌ క్లియర్‌ట్రిప్‌లో కొంత వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు సంబంధించి రెండు కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు వచ్చాయని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు స్పష్టం చేసింది. క్యాష్‌, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్‌ డాలర్ల మేర ఫ్లిప్‌కార్ట్‌ క్లియర్‌ ట్రిప్‌కు చెల్లించనుంది. 15 సంవత్సరాల క్రితం ముంబైలో ప్రారంభమైన క్లియర్‌ ట్రిప్ ప్లాట్‌ఫామ్‌ ట్రావెల్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను అందిస్తుంది. అయితే గత ఏడాది నుంచి కోవిడ్‌ కారణంగా హాస్పిటాలిటీ, ట్రావెల్‌ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో నష్టాల్లోకి జారుకున్న క్లియర్‌ ట్రిప్‌ తన వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.

అయితే తాజా నిర్ణయంపై క్లియర్‌ ట్రిప్‌కు చెందిన ఒక అధికారి బిజినెస్‌తో మాట్లాడుతూ..ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరిగాయి. త్వరలోనే ఈ డీల్‌కు సంబంధించిన లావాదేవీలు ముగియనున్నాయని అన్నారు. కోవిడ్‌ ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాలను పూడ్చుకునేందుకు తమ వాటాని ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మాలని నిర్ణయించింది అని అన్నారు. క్లియర్‌ట్రిప్‌కు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ ట్రావెల్‌ అండ్‌ ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌, డీఎజీ వెంచర్స్‌, గండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొవైడర్‌ కాంకర్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. క్లియర్‌ ట్రిప్‌ పెట్టుబడిదారుల మూలధనంలో సుమారు 70 మిలియన్‌ డాలర్లను సేకరించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనుంది. తద్వారా ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ రంగంలో అగ్రస్థానమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని క్లియర్‌ ట్రిప్‌ అధికారి తెలిపారు.

కాగా, ఫ్లిప్​కార్ట్​ తాజాగా తన లాజిస్టిక్స్​, డాటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు అదానీ గ్రూప్​తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని ఫ్లిప్​కార్ట్​ తెలిపింది.

ఇవీ చదవండి: POCO X3 Pro: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.2,499కే పోకో ఎక్స్‌3 ప్రో.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌

Toshiba CEO: తొషిబా సీఈవో రాజీనామా.. 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదమే కారణమా..?

SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌