జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై కేసు నమోదు..! అక్రమ నీటి కనెక్షన్ వ్యవహారమే కారణమా..?
Case File on GHMC Employee : కాసులకు కక్కుర్తిపడిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అక్రమనీటి కనెక్షన్ ఇచ్చి విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. ఫలితంగా అతడిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు
Case File on GHMC Employee : కాసులకు కక్కుర్తిపడిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అక్రమనీటి కనెక్షన్ ఇచ్చి విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. ఫలితంగా అతడిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ (హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ &ఎస్బి) విజిలెన్స్ విభాగం ఇన్స్‌పెక్టర్.. అక్రమ నీటి కనెక్షన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
రాజేంద్ర నగర్ లోని శివ సాయి కాలనీలో ఉన్న ఓ ఇంటి దగ్గర తనిఖీలు చేపట్టాడు. అక్కడ ఆయనొక అక్రమ నీటి కనెక్షన్‌ను గుర్తించాడు. దాని గురించి వాకబు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంజనేయులు అనే ఉద్యోగి (గతంలో హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ & ఎస్‌బిలో బడ్‌వెల్ సెక్షన్ కింద వర్క్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు), డిప్యుటేషన్‌పై, ఇప్పుడు జిహెచ్‌ఎంసి, రాజేంద్ర నగర్ సర్కిల్‌లో పనిచేస్తున్నారు.
ఆ ఇంటి యజమానికి, ఇతడికి జరగిన ఒప్పందం ప్రకారం.. అక్రమ నీటి కనెక్షన్‌ను ఇప్పించడంలో అంజనేయులు తీసుకున్న చొరవ గురించి తెలిసింది. దీంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో సివిల్ బాడీ ఉద్యోగిపై, ఇంటి యజమానిపై, అక్రమ నీటి కనెక్షన్ పొందినందుకు రెండు క్రిమినల్ కేసులు, యజమాని స్టేట్మెంట్, హెచ్ఎండబ్ల్యుఎస్ & ఎస్బి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు.
గతంలో కూడా ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగి పాతబస్తీలో 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వం తరఫున కర్మకాండ కొరకు రూ.20 వేలు అందిస్తుంది. అయితే ఓ బాధితుడికి రూ.20 వేలు అందించే క్రమంలో రూ.10 వెలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ నీ ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకొన్నారు.