Sarkaru Vaari Paata : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు

Sarkaru Vaari Paata : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా
Follow us

|

Updated on: Apr 16, 2021 | 12:58 PM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూ స్టైల్ నెట్టింట వైరల్ అవుతుంది.  ప్రీ లుక్బ్యాం కో మహేష్ మెడపైన ట్యాటూ కనిపించింది. ఇప్పుడు మహెష్ అభిమానులంతా అలా ట్యాటూ వేయించుకోవడానికి ముచ్చటపడుతున్నారు. ఇక ఈ సినిమా బ్యాంకింగ్  రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.ఈ మూవీ ఇటీవ‌ల దుబాయ్‌లో నెల‌రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకుంది. ఆ షెడ్యూల్ త‌ర్వాత ఏప్రిల్ 13 ఉగాది ప‌ర్వ‌దినం రోజున హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ ఈనెలాఖ‌రు వ‌ర‌కూ కంటిన్యూగా జ‌రుగుతుంది. సరిలేరు నీకెవ్వరు భారీ ఎంటర్‌టైనర్‌ తరువాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్లు 35 కోట్లకు అమ్ముడు పోయాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Karthika Deepam: నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే.. అంటూ కార్తీక్ వార్నింగ్ .. తప్పులను గుర్తుచేసుకుంటూ షాక్‌లో మోనిత

Sonu Sood : బ్యాండ్ వాలాగా మారిన రియల్ హీరో.. సోనులోని టాలెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్…