Karthika Deepam: నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే.. అంటూ కార్తీక్ వార్నింగ్ .. తప్పులను గుర్తుచేసుకుంటూ షాక్‌లో మోనిత

Karthika Deepam Serial: దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం . ఈరోజు 1015 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మరి ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!

  • Surya Kala
  • Publish Date - 12:13 pm, Fri, 16 April 21
1/8
Karthika Deepam 1
మాలతి కి దీపని చూపిస్తూ. .ఈమె నిక్ నేమ్ ఏమిటో తెలుసా. .వంటలక్క .. వంట అద్భుతంగా చేస్తుంది. అనడంతో.. ఈమె మీ వంటమనిషా అంటే.. వంట చేస్తుంది అన్నాను కానీ వంట మనిషి అన్నానా.. నా భార్య అంటూ డాక్టర్ మాలతికి పరిచయం చేస్తాడు..ఓ సారీ దీప అక్కడికి నేను అడిగా ఏమి మాట్లాడలేదు. మీరు తక్కువ మాట్లాడతారా ని అడుగుతుంది. అంత లేదు.. లాజిక్కులు మాట్లాడం మొదలు పెడితే.. మనమే అవాక్కు అయిపోవాలి. నువ్వు చెప్పిన టెస్టులు చేయించాను.. రిపోర్ట్స్ లో ఏముంది అని అడిగితె.. ఏమీ లేదు అన్నా.. అయితే ఎందుకు ఇక ఆస్పత్రికి అని అడిగింది ఏమి చెబుతాం. అంటాడు
2/8
Karthika Deepam 2
మీ ఆయన మా ఆయన నేను అందరం కలిసి ఒకే మెడికల్ కాలేజీలో చదువుకున్నాం దీప అంటూ రిపోర్ట్స్ తీసుకుని చూస్తుంది మాలతి. ఏమీ లేదని కార్తీక్ చెప్పాడు.. ఎందుకు లేదు చాలా ఉంది.. అంటే ఏమి భయపడకు.. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది.. హార్ట్ చాలా వీక్ గా ఉంది.. వీటన్నిటికీ రెగ్యులర్ గా మందులు వాడితే ఎటువంటి జబ్బులు రావు ఆంటూనే ఈఈజీ టెస్టుకు దీపని పంపిస్తుంది.
3/8
Karthika Deepam 3
భయపడుతున్న దీపతో నేను రానా అని కార్తీక్ అడుగుతుంటే.. మాలతి ఎందుకు నువ్వు వెళ్లినా బయట నిలబెడతారు.. నువ్వు దీప అని పంపించి దీప హెల్త్ కండిషన్ గురించి కార్తీక్ కు చెబుతుంది. తను వేడి సెగ దగ్గర ఉండడంతో లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి.. రోజు రోజుకీ ఈ జబ్బు తినేస్తుంది.. లంగ్స్ క్యాన్సర్ గా మారకుండా ఉండడానికి మందులు రాస్తాను.. అవి కరెక్ట్ గా వాడాలి.. ఆమెను ఎక్కువగా స్ట్రెస్ కు గురిచేయవద్దు.. వంట జోలికి అసలు వెళ్లనీయద్దు అని చెబుతుంది డాక్టర్ మాలతి.
4/8
Karthika Deepam 4
సౌందర్య మేడం కి మోనిత మేడం షాకుల మీద షాకులిస్తుంది.. ఇది శాంపిల్ మాత్రమే.. ముందుంది ముసళ్ల పండగ అని అనుకుంటుంది.
5/8
Karthika Deepam 5
దీప కార్తీక్ లు ఇంటికి వస్తారు. కార్తీక్ రూమ్ లోకి వెళ్లిన దీప. సంతోషంగా గతాన్ని గుర్తు చేసుకుంది. మందులను వేసుకుంటుంది. అది చూసి అత్తగారు, పిల్లలు సంతోష పడతారు. వెళ్లి మీ నాన్నకు థాంక్స్ చెప్పండి అని పిల్లల్ని పంపిస్తుంది సౌందర్య. కార్తీక్ కొట్టిన విషయం అత్తగారితో చెబుతుంది. సౌదర్యం సంతోషంతో కన్నీరు పెట్టుకుంటూ.. పదేళ్లు ఇప్పుడు కరిగాడు నా వంశోద్ధారకుడు, ,నా బంగారం అంటూ సంతోష పడుతుంది. జాగ్రత్తగా ఉండు మీరిద్దరూ దగ్గరయ్యారని తెలిస్తే.. ఆ మోనిత ఎంతకైనా తెగిస్తుంది.. ఇవాళ మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుకోవడానికి వచ్చింది అని చెబుతుంది సౌందర్య..
6/8
Karthika Deepam 6
ఆదిత్య సంతోషంగా వచ్చి కార్తీక్ ని హత్తుకుంటాడు.. ఈరోజు నుంచి వదిన కష్టాలు తీరిపోయినల్టు అంటాడు. మందులు సరిగ్గా వేసుకోకపోతే మీ వదిన కష్టాలు తీరవు ఈరోజునుంచే కష్టలు మొదలైనల్టు లెక్క అనుకుంటాడు కార్తీక్.. దీప దగ్గరకి భాగ్యం బయలు దేరుతుంది.
7/8
Karthika Deepam 7
మోనిత ఇంటిలో విచారంగా కూర్చున్న కార్తీక్ ని ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. .నీ గురించే. ఈ మధ్య నీ ప్రవర్తన లో ఎదో మార్పు కనిపిస్తుంది. అంటాడు కార్తీక్.. నేను ఎం చేశాను అంటూ ప్రశ్నిస్తుంది మోనిత. ఒక నిజం దాచావు అంటే షాక్ తింటుంది.. దీప అడ్రస్ ఎలా తెలిసింది అని అడగలేదు. .ఎందుకు .. అని ప్రశ్నిస్తాడు.. ఒకరు చెప్పారు అందంతోనే షాక్ తింటుంది. నువ్వే అనగానే నేనా అంటూ షాక్ తింటుంది. నేను నిన్ను ఏమీ అడగలేదు. ఎందుకంటే నాకు పిల్లల అడ్రస్ తెలిసింది కనుక క్షమించాను.. దీప ఒక్క అబద్ధం చెప్పినందుకే ఇన్నేళ్లు ద్వేషిస్తూ వచ్చాను. ఇది నీ మొదటి తప్పుకనుక ఊరుకుంటున్నాను..నువ్వు కూడా ఇంతకు ముందు కానీ. ఇక మీదట కానీ ఏమైనా నా దగ్గర దాచావని తెలిస్తే జీవితాంతం క్షమించను అని కార్తీక్ చెప్పడంతో మోనిత షాక్ తింటుంది.
8/8
Karthika Deepam 8
దీప ఫ్యామిలీ మొత్తం కలిసి సంతోషంగా ఉంటారు. ఆనందావు సంతోషంగా ఉందని అంటాడు.