Bigg Boss 4 : హీరోగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్…కొత్త సినిమా షురూ చేసిన అఖిల్

Bigg Boss 4 : హీరోగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్...కొత్త సినిమా షురూ చేసిన అఖిల్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగింది. గత మూడు సీజన్స్ లానే ఈ సీజన్ 4 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Rajeev Rayala

|

Apr 16, 2021 | 4:23 PM

Bigg Boss 4 :కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగింది. గత మూడు సీజన్స్ లానే ఈ సీజన్ 4 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హోస్ లో కంటెస్టెంట్స్ లో ఒకరైన అఖిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. హౌస్ లో అందరితో కలివిడిగా ఉండే అఖిల్. అభిజిత్ తో మాత్రం గూడవలు పెట్టుకుంటూ హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక మోనాల్ తో లవ్ స్టోరీ నడుపుతూ అఖిల్ సందడి చేసాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మోనాల్తో  ఆడపడదపా కనిపిస్తూన్నాడు.  తాజాగా గా అఖిల్ హీరో అవతారమెత్తాడు.. హేమంత్ ఆర్ట్స్ పతాకంపై అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్ జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. “ఫస్ట్ టైం” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా . ఉగాది పర్వదినం సందర్భంగా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యమ్. యల్.ఏ. రఘునందన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

దర్శక, నిర్మాత ఐ.హేమంత్ మాట్లాడుతూ ….బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు అనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం 1500 ప్రొఫైల్స్ చూసి అనిక కు సెలెక్ట్ చేయడం జరిగిందని అన్నారు. త్వరలో  కర్నాటకలో  రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అదే నెల చివరికంతా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాము .అన్ని అనుకున్నట్లు షూటింగ్ జరిగితే వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్ లో ప్రిలుక్ టీజర్ ను రిలీజ్ చేస్తూన్నాము.ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్భం చేస్తాం. ఈ మూవీ ద్వారా కొన్ని కొత్త టెక్నోలజీ తీసుకువస్తున్నాము..అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. అలాగే  అఖిల్ మాట్లాడుతూ… హేమంత్ ఈ స్టోరీ గత సంవత్సరం క్రితమే చెప్పాడు.నేను ఈ కథ విన్న తరువాత నేను రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యాను.ఎందుకంటే ఇది డిఫ్రెంట్ యూనిక్ స్టోరీ .నేను చాలా కథలు విన్నా హేమంత్ చెప్పిన కథ నా మైండ్ లో ఉండేది.ఇలాంటి కథ నాకు దొరకదని ఈ సినిమా తప్పక చేయ్యాలని చేస్తున్నాను.ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఇలాంటి డిఫ్రెంట్ కథలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiccha Sudeep: 14 భాషల్లో 55 దేశాల్లో విడుదల కానున్న స్టార్ హీరో సినిమా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu