Priya Prakash Varrier: ”ఇష్క్” పైనే ఆశలు పెట్టుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్..
ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Priya Prakash Varrier Ishq Movie: ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో ‘ఇష్క్` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.
ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించి ఆకట్టుకున్న తేజ జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు ఇష్క్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఓరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో తేజకు జోడీగా నటిస్తుంది. ఈ అమ్మడు ఇటీవల యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డింది. ఇక ఇప్పుడు ఇష్క్ సినిమాతో రాబోతుంది ప్రియా. ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ ఈ సినిమా పైనే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే ప్రియకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇష్క్ సినిమాకు మహతి స్వరసాగర్ బాణీలు సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. వరప్రసాద్ ఎడిటర్‌గా, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :