AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiccha Sudeep: 14 భాషల్లో 55 దేశాల్లో విడుదల కానున్న స్టార్ హీరో సినిమా..

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ `విక్రాంత్ రోణ‌`. జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన 'విక్రాంత్ రోణ‌' చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు.

Kiccha Sudeep: 14 భాషల్లో 55 దేశాల్లో విడుదల కానున్న స్టార్ హీరో సినిమా..
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2021 | 8:21 AM

Share

Kiccha Sudeep:

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ `విక్రాంత్ రోణ‌`. జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా సిల్వ‌ర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సుదీప్ న‌టిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా కిచ్చా సుదీప్ సినీ జ‌ర్నీకి సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

పాన్-వరల్డ్ మూవీగా రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ `విక్రాంత్ రోణ‌` పద్నాలుగు భాషల్లో, 55 దేశాలలో విడుదలఅవుతుండ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ “మా `విక్రాంత్ రోణ‌`ను ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేస్తున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బెస్ట్ టెక్నీషియ‌న్స్‌తో విక్రాంత్ రోణ అనే స‌రికొత్త హీరోను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం“ అన్నారు. ఇక విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందుతోన్న `విక్రాంత్ రోణ‌` చిత్రాన్ని త్రీడీ టెక్నాల‌జీలో విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తారు. ఇక సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజమోళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే సుదీప్ నటించిన పలు కన్నడ సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : Venkatesh: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ దృశ్యం2….సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ అదేనట..

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాప్ డీపీలో బాలయ్య…!! ఆశ్చర్యం లో నెటిజన్లు… ( వీడియో )

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..