Thellavarithe Guruvaram: ఓటీటీలో టెలికాస్ట్ కానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తెల్లవారితే గురువారం’
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆతర్వాత తెల్లవారితే గురువారం
Thellavarithe Guruvaram:
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆతర్వాత తెల్లవారితే గురువారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది. రొమాంటిక్ కామెడీ ‘తెల్లవారితే గురువారం’ సినిమాను నేడు ( ఏప్రిల్ 16)నప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది క్రాక్, నాంది, గాలి సంపత్, జాంబి రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘ఆహా’ ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి సిద్దమైంది.
శ్రీసింహా, మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా ..నేటి యువతలో చాలా మంది ఎదుర్కొంటున్న గందరగోళాలను తెరపై చూపెట్టే చిత్రం. ప్రేమ, బంధాలపై మరింత గౌరవాన్ని పెంపొందించేలా చేసే చిత్రమిది. మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల ను తేలికగా అందరికీ అర్థమయ్యేలా కామెడీ కోణంలో తెరకెక్కించారు. వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్యమంగా ‘ఆహ’ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్స్ వరకు..అలాగే వెబ్ సిరీస్‌లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్టైన్ చేస్తుంది ‘ఆహ’.
మరిన్ని ఇక్కడ చదవండి :