ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..
Corona Update

అసలే కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ.. ఆపై పెరుగుతోన్న పాజిటివ్ కేసుల ఆందోళన.. ఈలోగా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు....

Ravi Kiran

|

Apr 16, 2021 | 10:48 AM

అసలే కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ.. ఆపై రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల ఆందోళన.. ఈలోగా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు.. ప్రజలను సతమతం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కోవిడ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చిగుళ్ల వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధితో కరోనా త్వరగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని డాక్టర్ గౌడ్స్ డెంటల్‌ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్‌ వికాస్‌గౌడ్‌ వెల్లడించారు.

చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్ ఊపిరితిత్తుల్లోకి లేదా నేరుగా రక్తంలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అన్నారు. గత కొన్నాళ్లుగా దీనిపై అంతర్జాతీయ జర్నల్స్ పరిశోధనలు చేస్తోందని.. ఆ సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి వికాస్ గౌడ్ ఈ వివరాలను తెలియజేశారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ల వాపు ఉన్నా కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

చిగుళ్ల వద్ద ఉండే వాహకాలు (ఏసీఈ–2) వైరస్‌ను నేరుగా శరీరంలోకి తీసుకెళ్తాయని.. అందుకే నోటి పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని అన్నారు. మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు ఉన్నవారికి.. పొగాకు, గుట్కా ఎక్కువగా వినియోగించే వారికి చిగుళ్ల సమస్యలు ఉంటాయని.. వీరికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వీరంతా కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని.. ఆరు నెలలకు ఒకసారి దంతాలను శుభ్రపరుచుకోవాలని సూచించారు. నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చునని తెలిపారు.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu