India Corona Cases: దేశంలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్.. గత 24గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు

India Corona Cases: భారత దేశంలో కోవిడ్ 19 అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో మళ్ళీ గత కొన్ని రోజులుగా విజృంభిస్తుంది. రోజు రోజుకీ భారీ సంఖ్యంలో కేసులు నమోదవుతున్నాయి...

India Corona Cases: దేశంలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్.. గత 24గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు
India Coronavirus
Follow us

|

Updated on: Apr 16, 2021 | 10:35 AM

India Corona Cases: భారత దేశంలో కోవిడ్ 19 అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో మళ్ళీ గత కొన్ని రోజులుగా విజృంభిస్తుంది. రోజు రోజుకీ భారీ సంఖ్యంలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుతం.. రాష్ట్రప్రభుత్వాలకు పలు సూచనలు ఇచ్చింది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూని కూడా విధించారు. భారత్ లో ప్రవేశ అడుగు పెట్టిన తర్వాత ఎన్నడూ లేనంత దారుణంగా కేసులు నమోదవుతున్న. దేశంలో తీవ్రం రూపం దాల్చింది.గత 24 గంటల్లో రెండు లక్షలకు పైగా కొత్తగా కేసులు నమోదై రికార్డ్ సృష్టించింది.

దేశంలో 24 గంటల్లోనే 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వరసగా తొమ్మిదో రోజు కూడా లక్షకు పైగా కరోనా బాధితులు సంఖ్యా నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి.

దేశంలో నమోదైన కేసుల్లో 80.76 శాతం ఈ 10 రాష్ట్రాల్లోనీవే అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రాలకు పలు సూచనలు ఇచ్చింది. ఇక మరోవైపు దేశ వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో కోట్లాదిమందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కొన్ని కోట్లమందికి కోవిడ్ వ్యాక్సిన్ ను ఇచ్చారు.

Also Read: మీరు దైర్యవంతులా పాములంటే భయం లేదా.. ఐతే ఈ టబ్‌లో కూర్చుంటే.. అక్షరాలా ఏడు లక్షలు గెలుచుకునే అవకాశం

హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి