Viral Video: మీరు దైర్యవంతులా పాములంటే భయం లేదా.. ఐతే ఈ టబ్‌లో కూర్చుంటే.. అక్షరాలా ఏడు లక్షలు గెలుచుకునే అవకాశం
Snakes Tub: సోషల్ మీడియా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా.. ఏ వింతలు విశేషాలు చోటు చేసుకున్నా వెంటనే అందరికీ తెలుస్తున్నాయి. తాజాగా ఓ యు ట్యూబర్..
Snakes Tub: సోషల్ మీడియా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా.. ఏ వింతలు విశేషాలు చోటు చేసుకున్నా వెంటనే అందరికీ తెలుస్తున్నాయి. తాజాగా ఓ యు ట్యూబర్ మిస్టర్ బెస్ట్ మరో క్రేజే పందెంతో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాడు. మిస్టర్ బెస్ట్ అస్లు పేరు జిమ్మీ డోనాల్డ్సన్. ఇతడిని స్నేహితులు బహుమతి గెలుచుకోవడానికి ఓ పందెం లో పాల్గొనమని చెప్పారు.. అత్యంత సాహసకృత్యాల పోటీలో పాల్గొనమని జిమ్మీ స్నేహితులు మరియు సహచరులను సవాలు చేశారు. వీటిల్లో పాములతో నిండిన బాత్‌టబ్‌లో కూర్చోవడం, పెద్ద బొద్దింకలతో కూడిన కంటైనర్ లోని డబ్బులను నోటితో నోట్లను బయటకు తీయడం వంటి సవాళ్లు ఉన్నాయి. ఈ మేరకు పందెం తాలూకా వీడియో ఒకటి ఆదివారం యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
22 ఏళ్ల మిస్టర్ డొనాల్డ్సన్, తాను ఏర్పాటు చేసిన సవాళ్లలో పాల్గొని గెలిచినా వ్యక్తులకు వ్యక్తులకు పదివేల డాలర్ల బహుమతిని ప్రకటించాడు. మొదటి సవాలు గా పాములు నిండి న ఓ టబ్ లో 30నిమిషాల పాటు కూర్చోవాలి. దీనిని అతను తన ముగ్గురు స్నేహితులకు సవాల్ విసిరాడు. వారు కనుక పాములు నిండిన తొట్టెలో కూర్చోవడానికి అంగీకరిస్తే ఒకొక్కరి $ 10,000 (సుమారు రూ. 7.5 లక్షలు) ఇస్తానని చెప్పాడు. అంతేకాదు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చునని ప్రకటించాడు.
ఏప్రిల్ 11న యూట్యూబ్ లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో వేలాదిమందికి ఆకర్షించింది. మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. కొంతమంది నెటిజన్లు ఈ వీడియో కామెంట్స్ కూడా చేశారు.. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు “జిమ్మీ మరియు బీస్ట్ బృందం మా జనరేషన్ లో మంచి కంటెంట్ సృష్టికర్తలుగా మారారు. మా మనసును దోచుకున్నారని కామెంట్ చేశారు. ఈ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానెల్ 59 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది. మిస్టర్ డొనాల్డ్సన్ 2017 యూట్యూబ్ వీడియో “I COUNTED TO 100000!” అనే పేరుతో పాపులర్ అయ్యాడు. ఆ వీడియో ఇప్పటి వరకూ 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
Also Read: ఈ ఐదు కూరగాయలు తింటే ఆరోగ్యమే.. అయితే ఎక్కువగా తింటే కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసా..!
2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులకుగా ఇండియాలోకి అడుగు..