AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఓ వ్యక్తి ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లాడాడు. అదేంటి ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లి చేసుకోవటం...ఇదేదో ఆచారమో..లేక, సంప్రదాయమో...

Viral: ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!
Taiwan Boy
Ravi Kiran
|

Updated on: Apr 15, 2021 | 6:35 PM

Share

ఓ వ్యక్తి ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లాడాడు. అదేంటి ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లి చేసుకోవటం…ఇదేదో ఆచారమో..లేక, సంప్రదాయమో అనుకుంటున్నారు కదూ..! కాదండీ.! అసలు ఆ వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.! ఈ విచిత్ర సంఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

తైవాన్ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే 8 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారట. ఈ అవకాశాన్ని తైపై నగరానికి చెందిన ఓ బ్యాంకు క్లర్క్‌గా పనిచేసే వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న అతడు నిబంధనల ప్రకారం.. 8 రోజుల సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 8 రోజులు పూర్తి కాగానే భార్యకు విడాకులు ఇచ్చాడు. వెంటనే విడాకులు ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుని మళ్లీ బ్యాంకులో 8 రోజుల సెలవులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇలా సదరు వ్యక్తి నాలుగుసార్లు ఒకే అమ్మాయిని పెళ్లాడాడు. అయితే ఈ వ్యవహారమంతా సీక్రెట్‌గా ఉంటుందని అతడికి షాక్ తగిలింది.

ఎట్టకేలకు సదరు బ్యాంకు విషయాన్ని గ్రహించింది. ఈసారి సెలవులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అతగాడు అంతటితో ఆగలేదు.. దీనిపై లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అక్కడ అతడికి తీర్పు అనుకూలంగా వచ్చింది. అంతేకాదు, సెలవులు ఇవ్వని బ్యాంకు అధికారులకు లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిమానా కూడా విధించింది. కాగా, ఈ క్లర్క్ చేసిన ఘనకార్యానికి అనుకూలంగా తీర్పు రావడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఇక ఈ వింత కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వివరాలివే.!