AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

Telangana Inter Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను..

Breaking: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..
btech students
Ravi Kiran
|

Updated on: Apr 16, 2021 | 1:01 PM

Share

Telangana Inter Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అలాగే రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. జూన్‌లో కరోనా పరిస్థితులను పరిశీలించి.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

అటు ఇంటర్ సెకండియర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్ధులకు మినిమమ్ పాస్ మార్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ ఇయర్ ఎంసెట్‌లో 25 శాతం ఫస్టియర్ ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించిన వెయిటేజీ ఉండదని ప్రభుత్వం వెల్లడించింది. అటు ఇంటర్ ప్రాక్టికల్స్‌ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా, ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలను మూసివేసిన సంగతి విదితమే.

తెలంగాణలో పది పరీక్షలు రద్దు…

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ తరహాలోనే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉండగా.. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం కేసీఆర్‌కు పంపగా.. ఆ ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు… విద్యార్థులను ఎలా ప్రమోట్‌ చేస్తారో తెలుసా..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ సీబీఎస్‌ఈ పరీక్షలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు 12 తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నామని.. జూన్‌లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే.. సీబీఎస్‌ పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన తరుణంలో.. వారిని ఎలా ప్రమోట్‌ చేస్తారు. ఎలా ర్యాంకులను నిర్థారిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా ఒకేవేళ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తే.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పదో తరగతి బోర్డు ఫలితాలను విద్యార్థుల ఆబ్జెక్టివ్ నైపుణ్యాల ఆధారంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాతిపదికన కేటాయించిన మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందకపోతే.. పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తారు.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

Inter Exams Cancelled

Inter Exams Cancelled