Saranga Dariya Song: వెండితెర ‘సారంగదారియా’ సాంగ్ కు బుల్లి తెర నటీమణులు ఓ రేంజ్ లో డ్యాన్స్..
Saranga Dariya Song: తాజాగా టాలీవుడ్ లో వివాదాస్పదంగా నిలిచి సూపర్ హిట్ అందుకుంది సారంగదారియా సాంగ్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..
Saranga Dariya Song: తాజాగా టాలీవుడ్ లో వివాదాస్పదంగా నిలిచి సూపర్ హిట్ అందుకుంది సారంగదారియా సాంగ్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. లవ్ స్టోరీ మూవీ. ఇక ఈ సినిమాలోని తెలంగాణ జానపద పాట పల్లవి “దాని కుడి భుజం మీద కడువ.. దాని కుత్తెపు రైకలు మెరియా రమ్మంటే రాదు చెలియా…. దాని పేరే సారంగ దారియా” తో సాగే టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. ఈ పాటకి సాయి పల్లవి ఆట తోడై.. ఓ రేంజ్ లో సంగీత అభిమానులను అలరిస్తుంది. ఈ పాట చుట్టు ఎన్ని వివాదాలు నెలకొన్నా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. అనేక మంది ఈ సాంగ్ కు తమ డ్యాన్స్ కు జోడిస్తూ.. మళ్ళీ పేరడీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అంతగా ఆకట్టుకుంది ఈ తెలంగాణ పల్లెపాట. మంగ్లీ నోట వినిపించిన ఈ పాటకు సెలబ్రెటీలు సైతం సై అంటూ డ్యాన్స్ చేస్తూ .. తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా బుల్లి తెర సెలబ్రెటీలు కూడా ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసి తమ ఇన్ స్టాగ్రామ్ లో ఆ వీడియో షేర్ చేశారు. బుల్లి తెర అత్తమ్మల ఆటకు అందరూ ఫిదా.. బాలనటి నుంచి ఇప్పుడు బుల్లి తెరపై అమ్మగా, అత్తమ్మగా తన నటనతో ఆకట్టుకుంటున్న హరిత, వెండి తెరపై కంటే కూడా బుల్లి తెరపై మంచి పాత్రలతో పేరు తెచ్చుకున్న జయలలితలతో పాటు మరో నటి “దాని కుడి భుజం మీద కడువ.. దాని కుత్తెపు రైకలు మెరియా రమ్మంటే రాదు చెలియా…. దాని పేరే సారంగ దారియా” సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి ..
View this post on Instagram
Also Read: ఓవైపు కరోనా విజృంభన.. మరోవైపు పసిడి, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. ఎంతమేర పెరిగాయంటే
గ్యాస్ ప్రాబ్లెమ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. పొద్దున్నే ఈ వాటర్‌తో చెక్ పెట్టండి..