Gold and Silver Price: ఓవైపు కరోనా విజృంభన.. మరోవైపు పసిడి, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. ఎంతమేర పెరిగాయంటే
Gold and Silver Price: కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న బంగారం వెండి ధరలు.. గత కొన్ని నెలలుగా దిగి వచ్చాయి. ఇక గత నెలలో రూ.44,000 దిగువకు చేరుకున్నది. అయితే మళ్ళీ దేశంలో...
Gold and Silver Price: కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న బంగారం వెండి ధరలు.. గత కొన్ని నెలలుగా దిగి వచ్చాయి. ఇక గత నెలలో రూ.44,000 దిగువకు చేరుకున్నది. అయితే మళ్ళీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచంగా చోటుచేసుకున్న పరిణామాలతో పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చాయి. దీంతో ఏప్రిల్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,000కు పైనే కదలాడుతోంది. ఇదే విషయంపై మార్కెటింగ్ నిపుణులు స్పందిస్తూ.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా సెకండ్ వేవ్, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైం గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9500 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12400 తక్కువగా ఉంది. ఈ కాలంలో రూ.3 వేలు పెరిగింది.
ఇక మరోవైపు వెండి కూడా బండారం బాటలోనే పయనిస్తుంది. వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు పైన ఉంది. ఈరోజు ఓ సమయంలో రూ.68,000ను క్రాస్ చేసింది. ఇకపోతే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200.00 (0.30%) పెరిగి రూ.67838.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,708 వద్ద ప్రారంభమై, రూ.68,060.00 గరిష్టాన్ని, రూ.67,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. మళ్లీ 1750 డాలర్ల దిశగా కదులుతోంది. 6.75 (0.39%) డాలర్లు పెరిగి 1,743.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,7345.45-1,742.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగి 0.069 డాలర్లు తగ్గి 25.593 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.383-25.665 డాలర్ల మధ్య కదలాడింది. ఎక్కువమంది పసిడిపై పెట్టుబడులకు మొగ్గుచూపడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ తో బంగారు నగల కొనుగోళ్లు పెరగడం వంటి అనేక కారణాలు గోల్డ్ ధరలపై ప్రభావం చుపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
Also Read: చికెన్ లో వెరైటీ .. టేస్టీ టేస్టీ చికెన్ దో ప్యాజ్ తయారీ విధానం తెలుసుకుందాం..!
కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి