రూ.80 నుంచి రూ.16,000 కోట్లకు చేరిన లిజ్జత్ పాపడ్.. వారి సక్సెస్‌కు కారణం ఇదే..

Success Story of Lijjat Papad: లిజ్జత్ పాపడ్.. మీరు చిన్నప్పుడు టీవీలో ఈ ప్రకటనను తరచుగా చూసేవారు గుర్తుందా.... గత ఆరు దశాబ్దాలుగా ఈ బ్రాండ్ తయారు చేసిన పాపడ్.. భారతీయుల వంటగదిలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

రూ.80 నుంచి రూ.16,000 కోట్లకు చేరిన లిజ్జత్ పాపడ్.. వారి సక్సెస్‌కు కారణం ఇదే..
Lijjat Papad
Follow us
Sanjay Kasula

| Edited By: Balaraju Goud

Updated on: Apr 15, 2021 | 7:30 PM

లిజ్జత్ పాపడ్.. మీరు చిన్నప్పుడు టీవీలో ఈ ప్రకటనను తరచుగా చూసేవారు గుర్తుందా…. గత ఆరు దశాబ్దాలుగా ఈ బ్రాండ్ తయారు చేసిన పాపడ్.. భారతీయుల వంటగదిలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది స్నాక్స్ అయినా, ఖిచ్డి అయినా, లిజ్జత్ పాపడ్ లేకుండా డైనింగ్ టేబుల్ కానీ ప్లేట్ అసంపూర్తిగా అనిపిస్తాయి. పాపడ్ యొక్క అనేక బ్రాండ్లు మార్కెట్లో వచ్చాయి.

వ్యాపారం ఉద్దేశ్యం ఏంటి

నేడు ప్రతీ భారతీయ వంటశాలలకు చేరుకున్న లిజ్జత్ పాపడ్ కేవలం 80 రూపాయల వద్ద ప్రారంభమైంది. 7 మంది మహిళలు ఈ మొత్తంతో కలలు కన్నారు.. దానిని సాకారం చేసుకున్నారు. సరిగ్గా మార్చి 15, 1959న  ముంబైలోని రద్దీ ప్రాంతంలో శ్రీ మహిళా గ్రిహా ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ కు పునాది పడింది. ఇక్కడే ఈ సంస్థ వ్యాపారం ప్రారంభమైంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన  ఏడుగురు మహిళలు గుజరాతీలు..  ఈ వ్యాపారం  ముఖ్య ఉద్దేశ్యం.. వంటింటి నుంచి ఆర్థిక స్వావలంబన  సాధించడం వారి టార్గెట్.

అప్పు తెచ్చుకున్న డబ్బుతో వ్యాపారం ప్రారంభమైంది

దీనిని ప్రారంభించిన మహిళలు జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపాట్, పార్వతిబెన్ రామ్‌దాస్ తోడాని, ఉజ్మాబెన్ నారాయందస్ కుండాలియా, బానుబెన్ ఎన్ తానా, లగుబెన్ అమృత్‌లాల్ గోకాని, జయబెన్ వి విట్లానితోపాటు  దీపావాలిబెన్ లుక్కా ఈ మహిళలు సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు. సామాజిక కార్యకర్త చాగన్ లాల్ కరంసి పరేఖ్ నుండి 80 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ తర్వాత వ్యాపారం ప్రారంభించారు. పాపడ్ తయారీకి ముఖ్యమైన వస్తువులను 80 రూపాయలకు కొనుగోలు చేశారు. దీని తరువాత భవనం పైకప్పు నుంచి పాపడ్ తయారుచేసే పని మార్చి 15 న ప్రారంభించార. ప్రారంభంలో 4 ప్యాకెట్లు మాత్రమే పాపడ్ తయారు చేశారు.

తొలి ఏడాది సంపాదన..

ఈ పాపడ్లను ప్రసిద్ధ వ్యాపారవేత్త భులేశ్వర్ కు అమ్మడం ప్రారంభించారు. ప్రారంభంలో వీరి సంస్థ నష్టాల్లోకి వెళ్లినప్పటికీ.. ఎవరి నుంచి ఆర్థిక సహాయం కానీ..  విరాళం వంటివి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. చాగన్ లాల్ పరేఖ్ వారికి మార్గదర్శి మారారు. మహిళలు పని ప్రారంభించినప్పుడు వారు రెండు రకాల పాపడ్లను తయారు చేశారు. నాణ్యతతో ఎప్పుడూ రాజీపడవద్దని చగన్‌లాల్ సలహా ఇచ్చేవారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే 25 మంది మహిళలు ఈ పరిశ్రమలో చేరారు. మొదటి సంవత్సరంలో ఈ సంస్థ 6196 రూపాయల విలువైన పాపడ్లను విక్రయించింది. విరిగిన పాపడ్లను పొరుగువారికి ఉచితంగానే పంపిణీ చేసేవారు.

వర్షంలో కూడా వ్యాపారం..

వ్యాపారం ప్రారంభమైన తొలినాళ్లలో వర్షం కారణంగా వ్యాపారం ఆపవలసి వచ్చింది. కానీ మరుసటి సంవత్సరం ఒక మంచంతోపాటు… పొయ్యి సహాయంతో ఈ సమస్యను అధిగమించారు. మంచం మీద పాపడ్లు పరచడం.. దాని కింద స్టవ్స్ ఉంచి వాటిని ఎండబెట్టేవారు. రెండేళ్లలో 100 నుంచి 150 మంది మహిళలు ఈ పరిశ్రమకు అటాచ్ అయ్యారు. మూడవ సంవత్సరం చివరి నాటికి 300 మంది సభ్యులు సంస్థతో సభ్యులుగా మారారు. ఈ మహిళలందరికీ ఒకే బిల్డింగ్ లో వసతి కల్పించడం కష్టంగా మారింది. అదే సమయంలో వర్క్ ఫ్రం హోం అనే పద్దతిని తీసుకొచ్చారు. పాపడ్ తయారీకి అవసరమైన పిండిని వారి ఇళ్లకే పంపించడం..  పాపడ్ తయారుచేసిన తర్వాత ఆ పాపడ్ ప్యాకింగ్ కోసం పాత స్థలానికి తిరిగి తీసుకురావలని నిర్ణయించారు. ఈ పనిలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు.

ప్రస్తుత పరిస్థితి ఏంటి..

ప్రస్తుతం.. ఇది 82 శాఖలకు విస్తరించింది. ఇక్కడ వీరి పని ఉదయాన్నే మొదలవుతుంది.  పాపడ్ తయారు చేయడం.. అనంతరం వాటిని ప్రధాన కార్యాలయంలో అప్పగించడం చేస్తుంటారు. పాపడ్ తయారీ అనేది ఒక రకమైన వ్యాపారం.. దీనికి నైపుణ్యం అవసరం, కానీ ఉన్నత చదువులు అవసరం లేదు.

రూ. 80 నుంచి రూ. 16,00 మిలియన్లకు

నేడు ఈ పాపడ్ పరిశ్రమ మహిళా సాధికారతకు అతిపెద్ద ఉదాహరణగా మారిపోయిది. రూ .80 నుంచి మొదలైన వ్యాపారం రూ .16,00 మిలియన్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 45,000 మంది మహిళలు ప్రస్తుతం ఈ సంస్థతో కలిసి పని చేస్తున్నారు. 2010 నాటికి సంస్థ వార్షిక ఆస్తులుగా 290 మిలియన్ రూపాయలు కలిగి ఉంది. నేడు ఈ పరిశ్రమ మహిళలను స్వావలంబన దిశగా పయనిస్తోంది.

ఇవి కూడా చదవండి: YS Sharmila Deeksha: 24 గంటలా..? 72 గంటలా..? షర్మిల దీక్షపై కొనసాతున్న సస్పెన్స్..

Sri Rama Navami 2021: నరుడుగా పుట్టి.. దైవంగా పూజలందుకుంటున్న శ్రీరాముడి గుణాలు ఏమిటంటే..!