YS Sharmila Deeksha: 24 గంటలా..? 72 గంటలా..? షర్మిల దీక్షపై కొనసాతున్న సస్పెన్స్..
హైదరాబాద్‌లో షర్మిల దీక్షపై సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి కాసేపట్లో దీక్ష ముగియాల్సి ఉంది. అయితే ఆమె 72 గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం 24 గంటలే...
హైదరాబాద్‌లో షర్మిల దీక్షపై సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి కాసేపట్లో దీక్ష ముగియాల్సి ఉంది. అయితే ఆమె 72 గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం 24 గంటలే దీక్షకే అనుమతి ఉందంటున్నారు. ఈ క్రమంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు ఆమె అనుచరులు. 24 గంటలా? 72 గంటలా అన్న ఉత్కంఠ నేపథ్యంలో ఇందిరాపార్క్ దీక్షా శిబిరం దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు పోలీసులు.
తెలంగాణలో ఉద్యోగదీక్ష చేపట్టారువైఎస్ షర్మిల. యువతకు ఉద్యోగాల కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు షర్మిల ఉద్యోగదీక్ష కొనసాగనుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలను ఈ దీక్షకు ఆహ్వానించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షర్మిల. ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ.. ఆమె ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ దీక్షకు దిగారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే…ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి రోజు అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీని ఆవిష్కరిస్తామని షర్మిల ప్రకటించారు. పేరు, జెండా, అజెండా అన్ని ఆ రోజే ప్రకటిస్తామని ఖమ్మం వేదికగా వెల్లడించారు వైఎస్ షర్మిల. ఆత్మగౌరవ తెలంగాణలో ప్రశ్నించడానికే ఓ పార్టీ అవసరం అన్నారు. వైఎస్సార్‌ది సంక్షేమపాలన అన్నారు షర్మిల.