Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ జిల్లా.. ఆ జిల్లా అన్న తేడా లేకుండా.. అన్ని జిల్లాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలు.. కరోనాకు హాట్ స్పాట్‌గా మారాయి.

Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..
Corona Tension
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 15, 2021 | 4:45 PM

Corona: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ జిల్లా.. ఆ జిల్లా అన్న తేడా లేకుండా.. అన్ని జిల్లాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలు.. కరోనాకు హాట్ స్పాట్‌గా మారాయి. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత.. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర పక్కనే ఉన్న ఆదిలాబాద్‌ ఇప్పుడు భయం గుప్పిట్లోకి జారుకుంది. తెలంగాణలో కొత్తగా 3,307 కరోనా కేసులు వస్తే.. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1265 కొత్త కేసులొచ్చాయి. తెలంగాణలో వచ్చిన కేసుల్లో మూడింట ఒక వంతు అక్కడే నమోదయ్యాయి.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా విజృంభిస్తుండటం మంచిర్యాల జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయా రాష్ట్రాల నుంచి జిల్లాకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా అక్కడి ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు రాకపోకలపై దృష్టిసారించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయినా మహారాష్ట్రతో సరిహద్దు కలిగి ఉన్న మంచిర్యాల జిల్లాలో ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన 63వ జాతీయ రహదారి మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. సరిహద్దులో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో రాత్రింబవళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయి. కోవిడ్ దృష్ట్యా అధికారులు గతేడాది సరిహద్దు అయిన కోటపల్లి మండలం రాపనపల్లిలో చెక్‌ పోస్ట్ దగ్గర తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయడం.. జిల్లా వాసులకు ఎంతో మేలు చేసింది. అవతలివైపు నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రయాణికులకు స్క్రీనింగ్, అనుమానితులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడం లాంటి చర్యలు వ్యాధి కట్టడికి దోహదపడ్డాయి. మరోసారి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.. గతంలో మాదిరే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జిల్లా వాసులు.

ఇదంతా ఒక ఎత్తైతే.. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం. రద్దీ ఎక్కువగా ఉండే గాంధీ చౌక్,శివాజీ చౌక్,సూపర్ మార్కెట్, రైతు బజార్ లలో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్.. మాస్క్ ధరించని షాపు యజమానులకు జరిమానా విధించారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు.

మరోవైపు నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో పలు గ్రామాల్లో కళ జాతర కళాకారులనే కరోనాపై అవగాహన కల్పించారు అధికారులు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి : Krishna Death Story: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

India reports record corona cases : కోరలు చాస్తోన్న కరోనా, ఒక్కరోజులోనే 2 లక్షల కేసులకు చేరువలో.. న్యూ రికార్డ్