Krishna Death Story: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

Krishna Death: మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈరోజు ఎన్నో మరణాలు సంభవించాయి.. ఎన్నో మరణాలను చూసాం.. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువ మరణం..

Krishna Death Story: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే
Krishna Death
Follow us

|

Updated on: Apr 15, 2021 | 12:39 PM

Krishna Death Story: మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈరోజు ఎన్నో మరణాలు సంభవించాయి.. ఎన్నో మరణాలను చూసాం.. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువ మరణం గురించి చర్చిస్తున్నాం.. అవును రోజూ ప్రపంచంలో రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ వచ్చింది కదా.. అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. … ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా కరోనా కారణంగా ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా కోవిడ్ ఉన్న లేకపోయినా ప్రతి మరణాన్ని అనుమానించే స్టేజ్ ఏర్పడింది. దీంతో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?” అని. చాలామంది ఇదే విషయాన్ని తలచుకుంటూ మరింతగా కృంగిపోతున్నారు. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ సొంతూళ్లకు రాలేకుండా ఉన్నారు. వారందరి కోసం “మహాభారతం” మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా..

ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు…కానీ ప్రాణం లేకుండా..!

అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ కరోనా సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక.\

Also Read: ఇన్నాళ్లకు దీప కోరిక నెరవేర్చిన కార్తీక్.. సరికొత్త ప్లాన్ కు తెరలేపిన మోనిత.. నెక్స్ట్ ఏంటి..!

తన ఫేవరేట్ డైరెక్టర్ దర్శకత్వంలో వెండి తెరపై రీఎంట్రీ ఇస్తున్న కేరళ కుట్టి పవన్ కళ్యాణ్ హీరోయిన్