Meera Jasmine: తన ఫేవరేట్ డైరెక్టర్ దర్శకత్వంలో వెండి తెరపై రీఎంట్రీ ఇస్తున్న కేరళ కుట్టి పవన్ కళ్యాణ్ హీరోయిన్

Meera Jasmine: జాతీయ ఉత్తమ నటి.. తన అందం, అభినంయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన కేరళ కుట్టి మీరా జాస్మిన్ వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో...

Meera Jasmine: తన ఫేవరేట్ డైరెక్టర్ దర్శకత్వంలో వెండి తెరపై రీఎంట్రీ ఇస్తున్న కేరళ కుట్టి పవన్ కళ్యాణ్ హీరోయిన్
Meera Jasmine
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2021 | 11:21 AM

Meera Jasmine: జాతీయ ఉత్తమ నటి.. తన అందం, అభినంయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన కేరళ కుట్టి మీరా జాస్మిన్ వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మీరాజాస్మిన్. అయితే దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లి చేసుకుని దుబాయ్ కు షిప్ట్ ఐన తర్వాత మీరా జాస్మిన్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన వివాదాలతో తిరిగి ఇండియా చేరుకున్న మీరా జాస్మిన్ మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టనున్నది అనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది.. అయితే ఈ విషయాన్నీ తాజాగా మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ అధికారికంగా ప్రకటించారు.

మీరా జాస్మిన్ ఫేవరేట్ మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించే సినిమాతో రి-ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాని సత్యన్ అంతికాడ్ స్వయంగా ప్రకటించారు. ఆ సినిమాలో అల.. వైకుంఠపురములో’ హీరో ఫాదర్ గా నటించిన జయరామ్, మీరా జాస్మిన్ లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జూలై లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే గత ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో ప్రధాన పాత్రలో మీరా జాస్మిన్ నటిస్తున్న ఇదే కావడం విశేషం. తెలుగు లో అమ్మాయినిచ్చింది. భద్ర, గుడుంబా శంకర్ వంటి అనేక సినిమాల్లో నటించి తన చిరునవ్వుతో తెలుగువారి మదిని దోచింది. చివరిగా 2013 లో రిలీజైన థ్రిల్లర్ మూవీ మోక్షలో నటిచింది మీరా.

ఆ తర్వాత తన మాతృభాష మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. 2016లో వచ్చిన ‘పదు కల్పనకల్’ లాస్ట్ మూవీ. ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం .. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే 2014లో ఆమె దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత కూడా నటించడం కొనసాగించి.. 2016 నుంచి నటనకు దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు సినిమాలో నటించడానికి రెడీ అయ్యిది. 2003లో నటించిన మలయాళం సినిమా ‘పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్‌’తో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డుతో పాటు జాతీయ అవార్డు ను సైతం సొంతం చేసుకుంది.

Also Read:: మరోసారి క్రేజీ రోల్‌లో రాశీఖన్నా.. ఆమె కామెడీ టైమింగ్‌కు రీజన్ అదేనట

ప్రభుత్వం కీలక నిర్ణయం… విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!