Schools Holidays: ప్రభుత్వం కీలక నిర్ణయం… విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులు

Schools Summer Holidays: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోతోంది. కరోనా మొదటి వేవ్‌ లో కేసుల సంఖ్య తగ్గిపోగా, సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక దేశంలో ఆయా.

Schools Holidays: ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులు
Students
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 15, 2021 | 9:00 AM

Schools Summer Holidays: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోతోంది. కరోనా మొదటి వేవ్‌ లో కేసుల సంఖ్య తగ్గిపోగా, సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక దేశంలో ఆయా రాష్ట్రాలో కరోనా తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో విద్యాసంస్థలు సైతం మూతపడిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఆయా రాష్ట్రాలలో విద్యాసంస్థలు మళ్లీ తెరుకోగా, కరోనా కేసుల వల్ల మళ్లీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్‌ సింగ్‌ పార్మర్‌ తెలిపారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినప్పటికీ బోర్డ్‌ పరీక్షలు పూర్తయ్యే వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు తన టీచింగ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ, ఎయిటెడ్‌ పాఠశాలలకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 13వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకూ ఆన్‌లైన్‌ బోధన చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర హాస్టళ్లన్నింటికీ తక్షణమే వర్తిస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, ప్రినిపాల్స్‌కు ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసినట్టు చెప్పారు.

కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు పరీక్షలు సైతం రద్దు చేస్తున్నాయని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. మెల్లమెల్లగా తెరుచుకున్న పాఠశాలలు సైతం మళ్లీ మూతపడేలా చేసింది కరోనా. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే.. మరో వైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. మాస్క్‌ లేని వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా బయటకు వస్తే భారీగా జరిమానాల విధిస్తున్నారు.

ఇవీ చదవండి:

Maharashtra corona cases: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. కొత్తగా 278 మంది మృత్యువాత

Corona Tension: మహారాష్ట్ర కఠిన ఆంక్షలు..స్వస్థలాలకు వెళ్ళడానికి భారీగా రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్న ప్రజలు!

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!