VS Sunil Kumar: కేరళ మంత్రికి రెండోసారి సోకిన కరోనా మహమ్మారి.. ఆసుపత్రిలో చికిత్స..
Second time Covid positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. అందరూ కరోనా బారిన
Second time Covid positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. అందరూ కరోనా బారిన పడుతున్నారు. సమాన్య ప్రజల నుంచి ప్రముఖల వరకూ అందరికీ కోవిడ్ సంక్రమిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా.. వ్యాక్సిన్ తీసుకున్నా.. కూడా కరోనా సోకుతోంది. తాజాగా కేరళకు చెందిన మంత్రి మరోసారి కరోనా బారిన పడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్‌కు మరోసారి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మంత్రి సునీల్‌తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణకు కరోనా సోకింది. దీంతో వారిద్దరినీ త్రిస్సూర్‌లో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైరస్ నుంచి కోలుకునేంత వరకూ వారిద్దరూ ఆసుపత్రిలోనే ఉంటారని వైద్యాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం మంత్రి సునీల్ కుమార్ పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. గత వారం నుంచి మంత్రిని కలిసినవారంతా క్వారంటైన్‌లోకి వెళ్లాలని, వీలైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. కాగా.. మంత్రి వీఎస్ సునీల్ కుమార్ గతేడాది సెప్టెంబర్‌లో కరోనావైరస్ బారినపడ్డారు. అప్పుడు మొదటిసారి ఆయనకు కరోనా నిర్థారణ కాగా.. తిరువనంతపురం మెడికల్ కళశాలలో చికిత్స పొందారు. ఇదిలాఉంటే.. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో మొదటి ఐదింటిల్లో కేరళ కూడా ఉంది.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే ఆయన మళ్లీ కార్యాలయానికి చేరుకోనున్నారని.. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అంతకుముందు కేరళ క్యాబినెట్‌లోని పలువురు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
Also Read: