Corona Tension: మహారాష్ట్ర కఠిన ఆంక్షలు..స్వస్థలాలకు వెళ్ళడానికి భారీగా రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్న ప్రజలు!
రోనా రెండో వేవ్ దేశంలో పలు రాష్ట్రాలను చుట్టేస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నిరోధించడానికి పలు చర్యలు తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.
Corona Tension: కరోనా రెండో వేవ్ దేశంలో పలు రాష్ట్రాలను చుట్టేస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నిరోధించడానికి పలు చర్యలు తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. లాక్ డౌన్ విధించకపోయినా.. ఇంచుమించుగా లాక్ డౌన్ స్థాయిలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. దీంతో మళ్ళీ వలస జీవులకు కష్టాలు మొదలయ్యాయి. ముంబయిలో పనులు చేసుకునే అవకాశం లేకపోవడం.. మరింత వేగంగా కరోనా విస్తరిస్తుండటంతో స్వస్థలాలకు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం అయిపోయారు. వీరంతా ఒక్కసారిగా ముంబయిలోని లోక్ మాన్య తిలక్ టెర్మినస్ కు చేరుకున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా బయటి రాష్ట్రాలకు వెళ్లే దూరప్రాంత రైళ్లు బయలుదేరుతుంటాయి. అందుకే ప్రయాణీకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అక్కడకు చేరుకున్న వారిని స్టేషన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. భయపడాల్సింది లేదనీ, వెనక్కి వెళ్లిపొమ్మని వారికి చెప్పారు. అయినా, అక్కడికి వచ్చినవారు కదలకుండా ఉండిపోవడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు లోకమాన్య తిలక్ టెర్మినస్ వెలుపల అదనపు బలగాలను మోహరించారు.
రాబోయే పదిహేను రోజుల్లో తీవ్ర ఆంక్షలు అమలులో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలు అవుతాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో మంగళవారం నుంచే ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడానికి లోకమాన్య తిలక్ టెర్మినస్ కి చేరుకోవడం మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు ప్రత్యేక రైళ్లను మాత్రమే రైల్వే నడుపుతోంది. ఈ రైళ్లలో ఎక్కాలంటే కచ్చితంగా ముందుగా రిజర్వేషన్ చేసుకోవలసిందే. అంతే కాకుండా రైలు బయలుదేరడానికి గంటన్నర ముందే టికెట్ ఉన్న ప్రయాణీకులను స్టేషన్ లోకి అనుమతిస్తారు. ఈ విషయం తెలీక సామాన్య జనం స్టేషన్ వద్దకు చేరుకోడంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. వారిని నిలువరించడానికి పోలీసులు తిప్పలు పడుతున్నారు.
సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుతార్ మాట్లాడుతూ “ప్రజలు భయపడవద్దనీ.. టికెట్ ఉంటేనే స్టేషన్ కు రావాలనీ.. లేకపోతె రావద్దని కోరారు. స్టేషన్లలో రద్దీ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని దాటేసిన పాకిస్తానీ ఆటగాడు.. ఎవరంటే..?