యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో సూర్య వెబ్‌ సిరీస్‌..! మిడిల్ క్లాస్‌ లైఫ్ స్టోరీ నేపథ్యం.. ఆద్యంతం ఆసక్తికరం..

Surya Web Series : ఇటీవల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికిపోయిన యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్ అందరికి గుర్తుండే ఉంటాడు. తాజాగా అతడు నటించిన

  • uppula Raju
  • Publish Date - 5:41 pm, Wed, 14 April 21
యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో సూర్య వెబ్‌ సిరీస్‌..!  మిడిల్ క్లాస్‌ లైఫ్ స్టోరీ నేపథ్యం.. ఆద్యంతం ఆసక్తికరం..
Surya Web Series

Surya Web Series : ఇటీవల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికిపోయిన యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్ అందరికి గుర్తుండే ఉంటాడు. తాజాగా అతడు నటించిన సూర్య వెబ్‌ సిరీస్ యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఆ ఇన్సిడెంట్‌ తర్వాత కొద్దిరోజులు ఇంట్లోనే ఉన్న షణ్ముఖ్ తర్వాత ఈ సిరీస్‌పై ఫోకస్‌ పెట్టాడు. గతేడాది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈయన.. ఇప్పుడు సూర్యతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. సుబ్బు కే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ కూడా యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. తొలి రెండు ఎపిసోడ్స్ విడుదలైన తర్వాత షణ్ముక్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు.

మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీ, అమ్మ, నాన్న ఒక అమ్మాయి, ఓ అబ్బాయి. ఇందులో షణ్ముఖ్ మిడిల్ క్లాస్‌ అబ్బాయిగా టైటిల్‌ రోల్‌ పోషించాడు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సరదాగా గడిపే యువకుడిగా కనిపిస్తాడు. మూడేళ్లయినా ఉద్యోగం రాకపోవడంతో పంక్షన్లకు వెళ్లినప్పుడు బంధువుల దగ్గర అతడు ఎదుర్కొనే ఇబ్బంది సగటు కుర్రాడి కథను ప్రతిబింబిస్తుంది. చెల్లెలు ఉద్యోగం సాధించి బాగా సంపాదించడంతో సగటు కుంటుంబంలో జరిగే గొడవలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. తన జూనియర్‌ అమ్మాయితో ప్రేమలో పడటం.. ఉద్యోగం లేకపోవడంతో తను ఎక్కడ మిస్ అవుతుందనే ఇబ్బందిలో ఈ కాలం యువకులు పడే మనోవేదనను చాలా బాగా చూపించారు. జాబ్‌ కోసం ఇంటర్వూకు వెళ్లినప్పుడు ఇంజనీరింగ్ పర్సంటేజ్‌ సరిపోవడం లేదని రిజెక్ట్‌ చేస్తారు.. దీంతో బీటెక్‌ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి ఇందులో ప్రస్తావించారు.

మరోవైపు పిల్లల చదువుకోసం చేసిన అప్పును ఎలా తీర్చాలో తెలియక ఒక మిడిల్ క్లాస్‌ తండ్రి పడే ఆవేదన గుండెలను హత్తుకుంటోంది. ఇంకా చాలా సన్నివేశాలు ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్‌ అవుతున్నాయి. అందుకే ఈ సిరీస్ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తుంది. మిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళుతుంది. దీంతో షణ్ముఖ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అతడి ఫాలోయర్స్. పైగా కింద కామెంట్స్ కూడా అందరూ అతడికి సపోర్ట్ చేస్తూ పెట్టడం గమనార్హం.

సరికొత్త రికార్డుకు చేరువలో TCS…అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!

Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది

Gangster: ఒడిశాలో జైలు నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హైదరాబాద్ లో.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు!