సోనూసూద్ చేసిన పనికి చిరు టీం షాక్.. స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన రియల్ హీరో..

Sonu Sood : కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్‏డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టిన సోనూసూద్..

  • Rajitha Chanti
  • Publish Date - 5:43 pm, Wed, 14 April 21
సోనూసూద్ చేసిన పనికి చిరు టీం షాక్.. స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన రియల్ హీరో..
Sonu Sood

Sonu Sood : కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్‏డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టిన సోనూ.. రియల్ లైఫ్‏లో తన దాతృత్వానికి హద్దులు లేవని నిరుపించుకున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ.. పేదల జీవితాల్లో వెలుగును నింపాడు. అందుకే ఈ రియల్ హీరోకు ఎంతోమంది అభిమానులు గుడికట్టి దేవుడిగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా.. తమ వ్యాపారాలకు సోనూసూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తన అభిమానులను కలవడానికి సోనూ చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా.. సాదాసీదాగా వెళ్లి తన ఫ్యాన్స్‏కు ఖుషీ చేస్తుంటాడు. తాజాగా ఈ రియల్ హీరో హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. సోనూ కూడా కోలీవుడ్ స్టార్ మాదిరిగా ఓటు వేయడం కోసం సైకిల్ పై వెళ్ళాడు అనుకుంటే పొరపాటే. కేవలం తన సంతృప్తి కోసమే అలా షూటింగ్ స్పాట్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్ళాడు. ప్రస్తుతం సోనూసూద్.. మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ (Acharya) సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోకాపేటలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్లో జరుగుతుంది. దీని కోసం పార్క్ హయత్‏లో బస చేసిన సోనూసూద్.. బుధవారం ఉదయం అక్కడి నుంచి లొకేషన్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లాడు. ఇది చూసిన ఆచార్య టీం మెంబర్స్ మొదట్లో సోనూను చూసి ఒకింత ఆశ్చర్యపోయారు అయ్యారు.

Also Read: Balakrishna: సోషల్ మీడియాలో బాలయ్య బాబు హవా.. నెంబర్ వన్‏గా దూసుకెళ్తున్న ‘అఖండ’.. బోయపాటి ప్లాన్ అదుర్స్..

కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..