AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: సోషల్ మీడియాలో బాలయ్య బాబు హవా.. నెంబర్ వన్‏గా దూసుకెళ్తున్న ‘అఖండ’.. బోయపాటి ప్లాన్ అదుర్స్..

Akhanda Movie:నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. బాలయ్య మూవీ అంటే మాస్ ఆడియన్స్‏కు సంబరమే. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‏లో

Balakrishna: సోషల్ మీడియాలో బాలయ్య బాబు హవా.. నెంబర్ వన్‏గా దూసుకెళ్తున్న 'అఖండ'.. బోయపాటి ప్లాన్ అదుర్స్..
Balakrishna Akhanda
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2021 | 5:10 PM

Share

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. బాలయ్య మూవీ అంటే మాస్ ఆడియన్స్‏కు సంబరమే. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‏లో సినిమా వస్తుందంటే చాలు మాస్ ఆడియెన్స్‏కు పెద్ద పండగే. వీరిద్ధరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఏ రేంజ్‏లో ప్రేక్షకులను ఆకట్టున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు భారీగానే  పెంచుకుంటూ వచ్చారు బాలయ్య అభిమానులు. ఇన్ని రోజులు  బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంపై ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి… ఇక వాటన్నింటిని నిజం చేస్తూ.. ఉగాది పర్వదినం సందర్భంగా మూవీ టైటిల్ అఖండ అని ప్రకటిస్తూ.. టైటిల్ రోల్ వదిలారు మేకర్స్.

హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివ నామ స్మరణతో పవర్ ఫుల్ గెటప్‏లో ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఇక ఆ వీడియోలో కాలు దువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్‏కి ఫుల్ కిక్కిచ్చింది. ఆది నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూసిన బాలయ్య అభిమానులకు బోయపాటి ఒకేసారి ఫుల్ జోష్ ఇచ్చేశారు. ఇక ఈ వీడియోకు మరింత బలం థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‏లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక ఇందులో బాలకృష్ణ గెటప్‏కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి అఘోరాగా, మరోకటి కలెక్టర్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

వీడియో..

Also Read: కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..

వరుస సినిమాలతో బిజీగా మారిన బెబమ్మ..క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న కృతి శెట్టి : Krithi Shetty latest Photos

Follow Us
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..