కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..

Sharwanad New Movie Update: వైవిధ్యమైన పాత్రలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. కేవలం కామెడీ, ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలే కాకుండా..

కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..
Sharwanand
Rajitha Chanti

|

Apr 14, 2021 | 4:06 PM

Sharwanad New Movie Update: వైవిధ్యమైన పాత్రలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. కేవలం కామెడీ, ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలే కాకుండా.. అప్పుడప్పుడు యాక్షన్ స్టోరీలతో కూడా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాడు ఈ యంగ్ హీరో. అందుకే ‘ప్రస్థానం’ సినిమా నుంచి మొదలు నిన్నటి ‘శ్రీకారం’ వరకు అన్ని వైవిధ్యమే. ఈయన చిత్రాల విషయానికి వస్తే.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా.. స్టోరీ నచ్చిందంటే చాలు ఓకే చెప్పేస్తుంటాడు. ఇక ఈ ఫార్ములతోనే శర్వా అటు యూత్‏ను అట్రాక్ట్ చేయడంతోపాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఫేవరేట్‏గా మారిపోయాడు. ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ అనుకున్నంత సూపర్ హిట్ కాకపోయిన.. మంచి టాక్ మాత్రం సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత శర్వా నుంచి తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా శర్వా నెక్ట్స్ మూవీ గురించి ఫిల్మ్ నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది.

ఈ యంగ్ టాలెంటెడ్ హీరో మరోసారి పోలీస్ గెటప్‏లో కనిపించబోతున్నాడట. గతంలో రాధ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించి అల్లరి చేశాడు శర్వా. అయితే ఈ మూవీ డిజాస్టర్‏గా మిగిలిపోయింది. కానీ ఈసారి పూర్తిగా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోషించబోతున్నాడట. అది కొత్త డైరెక్టర్‏తో కలిసి ఈసారి సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఇప్పటివరకు వచ్చిన పోలీస్ స్టోరీలన్నింటి కంటే ఇది కాస్త కొత్తగా ఉంటుందని.. కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ శర్వా నచ్చడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫిషియల్ ప్రకటన రాలేదు.  ఇటీవల విడుదలైన శ్రీకారం సినిమాలో శర్వా్కు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఇందులోని సాంగ్స్‏కు శ్రోతల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Rebel Star Prabhas: ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

Lokesh About Balakrishna: మామను పొగడ్తలతో ముంచెత్తిన అల్లుడు.. ‘అఖండ’ అద్భుతమంటోన్న నారా లోకేష్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu