Rocking Star Yash: పొలం పనుల్లో క్రేజీ హీరో యష్ బిజిబిజీ… ఎంతఎదిగినా ఒదిగిఉండేతత్వం మా హీరోది అంటున్న ఫ్యాన్స్
Rocking Star Yash:కొంతమంది సమాజంలో తమకంటూ ఇమేజ్ వచ్చేసరికి గతాన్ని మర్చిపోతారు. అయితే మరికొందరు మాత్రం.. తాము ఏ స్టేజ్ కు చేరుకున్నా సరే గతాన్ని గుర్తుపెట్టుకుంటారు...
Rocking Star Yash:కొంతమంది సమాజంలో తమకంటూ ఇమేజ్ వచ్చేసరికి గతాన్ని మర్చిపోతారు. అయితే మరికొందరు మాత్రం.. తాము ఏ స్టేజ్ కు చేరుకున్నా సరే గతాన్ని గుర్తుపెట్టుకుంటారు.. తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ తన పొలంలోకి వెళ్ళాడు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యష్ ఇటీవలే తన సొంతూరు హసన్ లో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ పొలంలోకి వెళ్లిన యష్ అక్కడ భూమిలో ఏమున్నాయి.. ఏమి పండుతాయని చూశాడు. అయితే ఆ భూమిలో అక్కడక్కడ కొన్ని చెట్లు మాత్రమే దర్శనమిచ్చాయి. అయితే తాను కొనుగోలు చేసిన భూమిలో జరుగుతున్న పనులను చూడడానికి యష్ వెళ్లినట్లు తెలుస్తోంది పొలంలో ఉన్న యష్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మరవకూడదనే మాటను మా హీరో గుర్తు పెట్టుకున్నాడు.. తూచా తప్పకుండా పాటిస్తున్నారు అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
కాగా ఈ పొలం విషయంలో యష్ ఫ్యామిలీకి గ్రామస్థులకు మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తగాదా జిల్లా కలెక్టర్ గడప తొక్కింది. ఇక ఈ పొలం విలువ దాదాపు రూ. 80కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన యష్ తాజా సినిమా కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం.. దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు
వేలి ఉంగరం చూపిస్తూ.. మళ్ళీ వార్తల్లో నిలిచిన ఐటెం భామ మలైకా అరోరా..