AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh About Balakrishna: మామను పొగడ్తలతో ముంచెత్తిన అల్లుడు.. ‘అఖండ’ అద్భుతమంటోన్న నారా లోకేష్‌..

Lokesh About Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అందులోనూ...

Lokesh About Balakrishna: మామను పొగడ్తలతో ముంచెత్తిన అల్లుడు.. 'అఖండ' అద్భుతమంటోన్న నారా లోకేష్‌..
Lokesh About Balayya New Mo
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 7:25 PM

Share

Lokesh About Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అందులోనూ ఇది వరకు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోవడం ఆ అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో బోయపాటి కూడా అభిమానుల అంచనాకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయని చెప్పాలి. ఇక మొన్నటి వరకు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్‌తో పాటు బాలకృష్ణ సరికొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఉగాది సందర్భంగా.. బాలయ్య సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు. ‘అఖండ’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇక బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుండగా.. ఒక పాత్ర అఘోర. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ అఘోర పాత్రకు సంబంధించిందే. ఇక ఈ ఫస్ట్‌లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలయ్య బాబు అల్లుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కూడా వచ్చి చేరారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా ‘అఖండ’ టీజర్‌పై స్పందించారు. ఈ సందర్భంగా టీజర్‌ను పోస్ట్ చేసిన లోకేష్‌.. ‘బాల మామయ్య లుక్‌ అద్భుతంగా ఉంది. ఇక కొత్త సినిమా అఖండ టీజర్‌ మెస్మరైజ్‌ చేస్తోంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

లోకేష్‌ చేసిన ట్వీట్‌..

Also Read: Rebel Star Prabhas: ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

Rashmi Gautam: అందం అభినయం కలబోసినా ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.. పండగ పూట మెరిసిందిలా…

Trisha Krishnan: ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సినిమా.. నిరాశలో అభిమానులు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్