ఏ.ఆర్.రెహమాన్ ‘99 సాంగ్స్’..! ట్రైలర్‌పై స్పందించిన ప్రియాంక చోప్రా.. ఏం కామెంట్ చేసిందంటే..?
A.R.RAHMAN 99 SONGS : ఎ.ఆర్ రెహమాన్ చిత్రం 99 సాంగ్స్ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ట్రైలర్
A.R.RAHMAN 99 SONGS : ఎ.ఆర్ రెహమాన్ చిత్రం 99 సాంగ్స్ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ట్రైలర్ మార్చి 23 న విడుదలైంది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇటీవల ట్రైలర్ చూసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించింది. “సంగీతానికి పర్వతాలను కదిలించే శక్తి ఉంది. @arrahman అద్భుతమైన సంగీతం అందించాడు. ఏమి ఎలక్ట్రిక్ ట్రైలర్.. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ రెహమాన్ సర్, @itsEhanBhat & #EdilsyVargas @YM_Movies ”. అని ట్వీట్ చేసింది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘99 సాంగ్స్’ స్పెషల్ కాన్‌సర్ట్‌లో అకాడమీ, గ్రామీ అవార్డ్ విజేత అద్భుతమైన స్వరాలను ఎ.ఆర్.రెహాన్ ఏకం చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇహాన్ భట్ ‘99 సాంగ్స్’ సినిమా కోసం ఏడాది పాటు పియానోను ప్రత్యేకంగా నేర్చుకున్నారు.‘99 సాంగ్స్’ అనేది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్య ఒక మనిషి పోరాటం గురించి తెలియజేసే కథ. మనిషి బాధలకు విరుగుడు సంగీతం అనే చెప్పేలా ఈ కథ ఉంటుంది. ఇహాన్ భట్, ఎడిల్‌సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16, 2021న విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఎ.ఆర్.రెహమాన్ ‘99 సాంగ్స్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ కాన్‌స్టర్‌ను విడుదల చేశారు. ‘99 సాంగ్స్’ సినిమా సంగీతానికి సంబంధించి ప్రాభవాన్ని వివరించే డిజిటల్ షో ఇది. ‘99 సాంగ్స్’ సినిమా సంగీతానికి ఈ మ్యూజిక్ కాన్‌సర్ట్ ఇది వరకు చూడని అద్భుతమైన అనుభవాన్ని అందించింది. ఇప్పుడు ఈ డిజిటల్ కాన్‌సర్ట్ జియో సావన్‌లో లైవ్ ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే శ్రోతలకు ఈ మ్యూజిక్ కాన్‌సర్ట్ అద్భుతమైన ఓ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది.
ఇది చూడండి :
Music has the power to move mountains and no one understands that better than the amazing @arrahman. What an electric trailer… looking forward to the film. All the very best Rahman sir, @itsEhanBhat & #EdilsyVargas @YM_Movies https://t.co/mfATIuFVwR
— PRIYANKA (@priyankachopra) April 14, 2021