కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్… నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..

Virat Kohli:  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ జంట తమ ప్రేమకు గుర్తుగా ఓ పాపకు జన్మించింది.

  • Rajitha Chanti
  • Publish Date - 6:47 pm, Wed, 14 April 21
కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్... నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..
Virat Kohli Katrina Kaif

Virat Kohli:  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ జంట తమ ప్రేమకు గుర్తుగా ఓ పాపకు జన్మించింది. ఇటీవలే తమ కూతురి పేరు ‘వామిక’ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. తనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ విరుష్క దంపతులు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ మ్యాచ్‏లో బిజీగా ఉండగా.. అనుష్క తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. విరాట్‏కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో విరాట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.

ఆ వీడియోలో విరాట్‏ను ఓ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడు.. ఈ లైఫ్‏లో అతి పెద్ద ఆఫ్ ది ఫీల్డ్ క్షణం ఏంటీ అని అడిగింది. అందుకు స్పందించిన విరాట్.. కత్రినా కైఫ్ నాతో కేవలం రెండు నిమిషాలు మాట్లాడమే అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో వెంటనే ఆ యాంకర్ ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురైంది. నిజమా అంటూ సందేహం వ్యక్తం చేసింది. మళ్లీ విరాట్ సమాదానం చెబుతూ.. అవును నేను ఎందుకు అబద్ధం చెబుతాను అని అన్నారు. ప్రస్తుతం విరాట్ త్రోబ్యాక్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఫోన్ భూట్ చిత్రీకరణలో పాల్గోన్న కత్రినాకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు ఈ మహామ్మారి భారీన పడ్డారు. తాజాగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ కరోనాను జయించింది.

వీడియో..

Also Read:  బాలీవుడ్‏లోకి ‘అపరిచితుడు’.. విక్రమ్ పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరో… అక్కడ కూడా హిట్టు కొట్టేనా ?

‘నేను వాడిని చంపేస్తాను’.. సూపర్ స్టార్ నోట తెలుగు మాట.. ‘ఆరాట్టు’ టీజర్ ఇంట్రెస్టింగ్..